E-Paper
Advertisement

సగం పాల‌న ముగిసినా..! సంపూర్ణం కాని మంత్రివ‌ర్గం.. రేవంత్ స‌ర్కార్ రికార్డు..

సగం పాల‌న ముగిసినా..! సంపూర్ణం కాని మంత్రివ‌ర్గం.. రేవంత్ స‌ర్కార్ రికార్డు..
Advertisement

కేసీఆర్ ఓ టైపైతే.. ఇప్పుడు రేవంత్ కేబినెట్ మ‌రోటైపు. ఆయ‌న ఏ ఏడాది పాటు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణే చేయ‌లేదు రెండో ట‌ర్ములో. హ‌రీశ్‌రావుకు చెక్‌పెట్టేందుకు. మ‌హిళా మంత్రి లేకుండా సాగించేశాడు మ‌రో ట‌ర్ము. ఇప్పుడు రేవంత్ స‌ర్కార్ పాల‌న‌లో స‌గం ట‌ర్ము ముగిసినా.. ఇంకా మూడు బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. ఆశావ‌హుల‌ను ఊరిస్తూ.. ఊరిస్తూ.. కోటగాడు కోడిని వేలాడిదీసి ఉట్టి అన్నం తిన్న‌ట్టుగా.. ఢిల్లీ అధిష్టానం రేపు మాపు అంటూ ఆశ‌లు పెడుతున్న‌ది.

బీసీ కార్డు ప్ర‌యోగించినా.. రెడ్ల‌కు మాత్రం ఆశ వ‌ద‌ల్లేదు. నాక్కావాలంటే నాక్కావాల‌ని ఇంకా ఇద్ద‌రు రెడ్లు రెడీగా ఉన్నారు. మ‌హేశ్ కూడా త‌న‌కు డిప్యూటీ సీఎం ఇస్తారేమో బీసీ కోటాలో అని ఎదురుచూస్తున్నాడు. దాన్నిద‌క్కించుకుని.. చ‌లి అన్నం తింటా.. ఉడుకుది అయ్యేదాకా ఉంటా.. అని ఎగిర్త‌పు చుట్టం అన్న‌ట్టుగా మ‌హేశ్ డిప్యూటీ సీఎం అయితే.. బీసీ సీఎంకు దారి ద‌గ్గ‌ర‌ప‌డ్డ‌ట్టే క‌దా! అని స‌మాలోచ‌న‌లు చేస్తూ వ‌స్తున్నాడ‌ట‌.

Advertisement

అప్ప‌టి వ‌ర‌కు పుణ్య‌కాలం కాస్త దాటిపోతుంది. ఈ విష‌యంలో కొత్త రికార్డు సృష్టించాడు రేవంత్‌. పూర్తి స్థాయి కేబినెట్ లేకుండానే.. స‌గం పాల‌న కంప్లీట్ చేశాడు. ఆ మూడు బెర్తులు కూడా ఇప్ప‌ట్లో భ‌ర్తీ చేసేలా క‌నిపించ‌డం లేదు. స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌, మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి, ఇబ్ర‌హీంప‌ట్న ఎమ్మెల్యే మ‌ల్రెడ్డి రంగారెడ్డి.. రేవంత్ ప‌క్క‌లో బ‌ల్లెళ్లా మారారు. ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తూనే.. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా స‌ర్కార్‌పై విరుచుకుప‌డుతున్నారు.

మ‌రో వైపు హోంమంత్రి ప‌ద‌వి కూడా సీఎం ద‌గ్గ‌రే పెట్టుకోవ‌డం కూడా వివాద‌మై కూర్చుంది. రాష్ట్రంలో పోక్సో కేసులు విప‌రీతంగా న‌మోద‌వుతున్నాయి. బండి సంజ‌య్ కొడుకు ఉదంతం స‌ర్కార్‌కు ఓ మ‌చ్చ‌ను మిగిల్చింది. మొన్న‌టి షాబాద్ ఆరుగురిని హ‌త్య చేసిన రాజ్‌కుమార్ కేసు కూడా పొరుగు రాష్ట్రం ద‌గ్గ‌ర ప‌లుచ‌న‌య్యేలా చేసింది. మొత్తానికి పోలీస్ వ్య‌వ‌స్థ గాడి త‌ప్పింది.. దీనికి కార‌ణం హోంమంత్రి లేక‌పోవ‌డం.. సీఎం బిజీగా ఉండి.. హోం బాధ్య‌త‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

Advertisement

ఇక మున్సిప‌ల్ శాఖ‌, విద్యాశాఖ కూడా సీఎం ద‌గ్గ‌రే పెట్టుకున్నాడు. విద్యాశాఖ మీద కూడా అసంతృప్తి ఉంది. మున్సిప‌ల్ శాఖ విష‌యంలో స‌ర్కార్ ఇంకా పూర్తి స్థాయి ప‌ట్టు సాధించ‌లేదు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు పోవ‌డం లేదు. ఇంకా స‌మ‌యం తీసుకుంటున్న‌ది. ఎన్ని రోజులు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటే అంత‌గా బీజేపీ, బీఆరెస్ పార్టీలు లాభ‌ప‌డ‌తాయే త‌ప్ప‌.. కాంగ్రెస్ పుంజుకోవ‌డం క‌ష్టం.

మ‌రి ఇంత డ్యామేజీ అవుతున్నా.. ఇటు రేవంత్ ఢిల్లీ పెద్ద‌ల‌కు చెప్పి ఒప్పించ‌డంలో విఫ‌ల‌మ‌వుతుండ‌గా… రాహుల్ గాంధీ కూడా తెలంగాణ‌ను లైట్ తీసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తుంది. మ‌రోసారి వ‌స్తుందా? రాదా? అనుమానం బ‌లంగా మారుతోంది కాబోలు.. అని అనుకుంటున్నారు ఆ పార్టీ నేత‌లే.

Related News

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

స‌ర్కార్‌కు ఆ మూడు ఆయువు ప‌ట్టు.. అడ్మినిస్ట్రేష‌న్‌పై ఏదీ ప‌ట్టు..? ఆర్థిక ప‌రిపుష్టిపై ఏదీ ముద్ర‌..?

అప్పుడు వాళ్లు సుప్రీంలు… ఇప్పుడు ప‌ట్టింపేలేదా? ఇద్ద‌రి పాల‌న‌లో ఎమ్మెల్యేలెలా ఉన్నారు?

సీఎం బాగు కోసం ఆర్కే ప‌లుకులు.. స‌ర్కార్ వాస్త‌వ పరిస్థితి క‌ళ్ల‌ముందు పెట్టే ప్ర‌య‌త్నం.. అది సూచ‌నా? బెదిరింపా? ద‌బాయింపా?

బాల్కొండ బ‌రి నుంచి మ‌హేశ్‌? మ‌రి ఆ న‌లుగురి ప‌రిస్థితి? ఇందూరు కాంగ్రెస్‌లో ర‌చ్చ రాజ‌కీయం!

జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

రాజ‌కీయాల్లో ర‌ఘువీరా మ‌ళ్లీ యాక్టివ్.. పార్టీకి పూర్వవైభవం తెస్తారా?

తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

Big Stories

Advertisement
×