BigTV English

Nara Lokesh: హీరో విజయ్ సినిమా సీన్ రిపీట్.. అది రీల్.. ఇది రియల్.. లోకేష్ ఎఫెక్ట్.. కర్నూల్ లో భిక్షాటన ముఠా?

Nara Lokesh: హీరో విజయ్ సినిమా సీన్ రిపీట్.. అది రీల్.. ఇది రియల్.. లోకేష్ ఎఫెక్ట్.. కర్నూల్ లో భిక్షాటన ముఠా?

Nara Lokesh: తమిళంలో తేరీ సినిమా చూసే ఉంటారు. అదే సినిమా తెలుగులో పోలీసోడు గా విడుదలై హిట్ కొట్టింది. ఆ సినిమాలో హీరో విజయ్, ఓ విలన్ ని చితకబాదుతాడు. ఆ విలన్.. చిన్నారుల చేత భిక్షాటన చేయిస్తుంటే, హీరో ఒకరి కోసం వెళ్లి అందరి పిల్లల్ని రక్షిస్తాడు. అదే సీన్ కర్నూల్ లో సేమ్ టు సేమ్ జరిగింది. ఇక్కడ కూడా మంత్రి లోకేష్ ఆదేశాలతో ఒక్కరి కోసం వెళ్లిన అధికారులకు పదుల సంఖ్యలో చిన్నారులు దొరికారు.


ఒక్కరి కోసం వేట మొదలుపెడితే.. పెద్ద ముఠానే చిక్కింది కర్నూల్ లో. ఆ ముఠా భరతం పట్టేందుకు, అధికారులు పక్కా ప్లాన్ తో ప్రణాళిక రూపొందించారు. అసలేం జరిగింది? ఆ ముఠా ఎవరనుకుంటున్నారా.. అయితే తెలుసుకోండి.

కర్నూల్ నగరంలో ఓ బాలుడు ఒంటిపై రంగు పూసుకొని భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అది కూడా ఓ నెటిజన్ ఆ వీడియోను మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. కర్నూల్ నగరంలో ఓ ముఠా అదేపనిగా చిన్నారులకు రంగులు పూసి, భిక్షాటన చేయిస్తుందని అభం శుభం తెలియని ఆ చిన్నారులు.. ఎండనక, వాననక రోడ్ల వెంట తిరుగుతున్నట్లు సదరు నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆ వీడియోలో ఓ బాలుడు అలా కునుకు తీయడం, మళ్లీ భిక్షాటన సాగించిన దృశ్యాలు ఉండగా, మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు.


నేటి బాలలే రేపటి భావి భారత పౌరులన్న విషయాన్ని సమాజం మరచిపోయి, ఇటువంటి చేష్టలకు పాల్పడడం తగదని లోకేష్ కూడా రిప్లై ఇచ్చారు. అలాగే అసలు ఈ బాలుడు ఎవరు? ఇలా ఎన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతుందో తెలుసుకొని, భాద్యులను శిక్షించాలని అధికారులకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.

నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులకు భారీ షాక్ తగిలింది. ఆ వీడియోలో ఉన్న బాలుడి కోసం వెతుకులాట ప్రారంభించిన అధికారులు కర్నూల్ లో విస్తృతంగా పర్యటించారు. అలాగే బస్టాండ్స్, రైల్వే స్టేషన్ ల వద్ద తనిఖీలను సైతం నిర్వహించారు. ఈ తనిఖీల్లో వీడియోలో ఉన్న బాలుడిని పోలినట్లుగానే, మరికొందరు బాలురు అలాగే రంగులు పూసుకొని భిక్షాటన సాగిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. విచారించి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: Shiva Swamy Baba: ఏలూరులో కారంతో అభిషేకం చేయించుకున్న స్వామీజి.. ఎందుకలా? ప్రత్యేకత ఏమిటీ?

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని, రేపటి నుండి ప్రతి బాలుడు పాఠశాలకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారట. మంత్రి నారా లోకేష్ చేసిన ఒక్క ట్వీట్ తో కర్నూల్ అధికార యంత్రాంగం మొత్తం కదిలి, ఇలా చిన్నారుల చేత భిక్షాటన చేయిస్తున్న వారి భరతం పట్టేందుకు ప్రణాళిక రూపొందించారట. దీనితో మంత్రి నారా లోకేష్ చూపిన ప్రత్యేక చొరవకు నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×