Dhanush Aishwaryaa: కోలీవుడ్‌లో ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు సైతం ఈ విషయం విని ఆశ్చర్యపోయారు. ధనుష్, ఐశ్వర్య 18 ఏళ్ల పాటు కలిసున్నారు. ఇక 2022లో మేము కలిసి ఉండలేము అని ప్రకటన విడుదల చేశారు. ప్రకటన అయితే జరిగింది కానీ చట్టపరంగా వీరికి ఇంకా విడాకులు అవ్వలేదు. దీంతో వీరిద్దరూ మళ్లీ కలుస్తారేమో అని ఫ్యాన్స్ అంతా ఆశతో ఎదురుచూశారు. ధనుష్, ఐశ్వర్య విడిపోవడం రజినీకాంత్‌కు ఇష్టం లేదని, అందుకే మళ్లీ కలిసిపోతారని వార్తలు కూడా వచ్చాయి. కానీ మొదటిసారి విడాకుల కోసం కోర్టు ముందు హాజరయిన ధనుష్, ఐశ్వర్య.. ఇక తాము కలిసి ఉండలేమని తేల్చిచెప్పేశారు.
రెండేళ్ల క్రితం
తాజాగా తమ విడాకుల కోసం కోర్టు ముందు హాజరయ్యారు ధనుష్, ఐశ్వర్య. అయితే విడాకులు తీసుకోవడమే తమ తుది నిర్ణయమా అని న్యాయస్థానం అడిగినప్పుడు అదే తమ తుది నిర్ణయమని కన్ఫర్మ్ చేశారు. దీంతో నవంబర్ 27కు తీర్పును వాయిదా వేసింది కోర్టు. 2022 జనవరి 17న తమ విడాకుల గురించి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ధనుష్ (Dhanush), ఐశ్వర్య (Aishwaryaa). ‘‘18 ఏళ్లు ఫ్రెండ్స్‌గా, కపుల్‌గా, తల్లిదండ్రులుగా కలిసున్నాం. ఈ ప్రయాణంలో మేము ఎన్నో చూశాం. ఈరోజు మా దారులు విడిపోయే పరిస్థితి వచ్చింది’’ అంటూ తమ విడాకుల గురించి అనౌన్స్ చేసింది ఈ కపుల్. దీంతో వీరి విడిపోవడం అస్సలు బాలేదని ఫ్యాన్స్ చాలా ఫీలయ్యారు.
Also Read: బాయ్ ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయిన ప్రభాస్ బ్యూటీ..?
వేర్వేరు ఇళ్లు
ధనుష్, ఐశ్వర్యలకు ఇద్దరు కుమారులు. వారే యాత్ర, లింగ. ఈ ఇద్దరికి సంబంధించిన ముఖ్యమైన సందర్భాల్లో తల్లిదండ్రులుగా సపోర్ట్ అందించాలని ధనుష్, ఐశ్వర్య కలుస్తూనే ఉన్నారు. దీంతో వీరు మళ్లీ కలిసిపోతారనే వార్తలు చాలాసార్లు కోలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలోని పోస్ గార్డెన్‌లోనే ఉంటున్నా కూడా విడివిడిగా వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. ఈ విడాకులు రజినీకాంత్‌కు అస్సలు ఇష్టం లేదని కూడా కోలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. ఆయన కోసమైన వీరు మళ్లీ కలుస్తారేమో అని ఫ్యాన్స్ అనుకున్నా అది ఇక జరగదని తాజాగా జరిగిన కోర్టు హాజరు తర్వాత అందరికీ క్లారిటీ వచ్చేసింది.
కో పేరెంటింగ్
ఇప్పటికే ఎన్నోసార్లు విడాకుల విషయంపై ధనుష్, ఐశ్వర్య కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ వారు చాలాసార్లు కోర్టు హియరింగ్స్‌ను మిస్ చేశారు. ఇక ఇప్పుడు కోర్టు ముందు హాజరయ్యి వారి నిర్ణయాన్ని చెప్పడంతో నవంబర్ 27న వీరి వివాహ జీవితానికి చట్టపరంగా ఆఖరి రోజు కానుంది. భార్యాభర్తలుగా వీరిద్దరూ విడిపోయినా.. తల్లిదండ్రులుగా మాత్రం కో పేరెంటింగ్‌ను కొనసాగించనున్నారు ధనుష్, ఐశ్వర్య. ఇప్పటికే తను వెళ్లే దాదాపు ప్రతీ మూవీ ఈవెంట్‌కు తన కుమారులను తీసుకెళ్తుంటాడు ధనుష్. ఐశ్వర్య కూడా తమ పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికీ వీరి విడాకులకు సంబంధించిన కారణమేంటో తెలియలేదు.