Nara Lokesh: భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజూ రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేస్తున్న ఆగడాలకు అంతులేకుండాపోతోంది. గురువారం సాయంత్రం నారాయణ కాలేజీ భీమవరం వన్‌టౌన్ సీఎమ్‌ఆర్ వద్ద.. నారాయణ కాలేజీ బస్సులో విద్యార్ధినిని కొట్టి, దుర్భాషలాడి, రోడ్డుపై వీరంగం సృష్టించారు. బస్సులో వెళ్తున్న నన్ను ఎందుకు కొట్టావ్ అని ఆ విద్యార్ధి ప్రశ్నించగా.. విద్యార్ధినిపై దాడికి దిగారు ఆకతాయిలు. విద్యార్ధి బస్సు ఎక్కి వెళ్లిపోయినా.. ఆకతాయిలు మాత్రం బస్సును వెంబడించి, నడిరోడ్డుపై విద్యార్ధులను వెకిలి సేష్టలు చేస్తూ రెచ్చిపోయారు.
యువకులు సృష్టించిన అలజడికి వాహానదారులు ఆందోళనకు దిగారు. యువకులు మద్యం మత్తులో నిత్యం అలజడి సృష్టిస్తున్నారని స్కూల్స్, కాలేజీలకు విద్యార్ధినులు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అక్కడ ఉన్న సీసీకెమరాలో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఈతరానికి ఏం నేర్పుతున్నావ్ జగన్? రప్పా రప్పా.. కాస్త ఆలోచించప్పా!
భీమవరంలో విద్యార్ధులపై దాడి చేసిన వారిపై.. చర్యలు తీసుకోవాలి మంత్రి నారా లోకేష్ డీజీపీని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో.. పట్టపగలు విద్యార్ధులపై అరాచక వ్యక్తులు దాడి చేసిన సంఘటన.. తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పౌర సమాజంలో ఇటువంటి ప్రవర్తన.. ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఈ చర్యను సహించదని ఉద్ఘాటించారు. ఇది సభ్య సమాజానికి ఏమాత్రం అంగీకరించలేంది. నిందులతులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ వివరించారు.
Deeply disturbed by the incident in Bhimavaram where students were attacked in broad daylight by unruly individuals. Such behavior in civil society is unacceptable, and will not be tolerated. Strict action will be taken by @appolice100. We are committed to eradicating this menace… https://t.co/H1hwzkh4Bv
— Lokesh Nara (@naralokesh) June 20, 2025