BigTV English

Nara Lokesh in Coimbatore: కోయంబత్తూరుకి లోకేష్.. అందుకేనా..!

Nara Lokesh in Coimbatore: కోయంబత్తూరుకి లోకేష్.. అందుకేనా..!

Nara Lokesh Campaign in Coimbatore for BJP MP Candidate Annamalai: తెలుగుదేశం పార్టీ యువనేత నారాలోకేష్ బిజిబిజీ అయిపోయారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న ఆయన.. వారం రోజులుగా నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలతో సమావేశమయ్యారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. తాజాగా రెండురోజుల టూర్‌లో భాగంగా నారా లోకేష్ తమిళనాడు వెళ్తున్నారు.


తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఆయన తరపున ప్రచారం చేసేందుకు అక్కడికి వెళ్తున్నారు నారా లోకేష్. రెండురోజుల పాటు యువనేత అక్కడే మకాం వేయనున్నారు. దక్షిణ తమిళనాడులో తెలుగువారి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన చాలామంది ప్రజలు అక్కడ స్థిరపడ్డారు. దాదాపు 50 వేల మంది ఓటర్లు  ఉన్నట్లు ఓ అంచనా.

ఈ విషయాన్ని గమనించిన తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. బీజేపీ హైకమాండ్ ద్వారా పురందేశ్వరికి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నారా లోకేష్ అక్కడ ప్రచారానికి వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. తక్కువ సమయంలో తమిళనాడులో ఫేమస్ అయ్యారు అన్నామలై. ఆయనకు లోకేష్ జత కలిస్తే తిరుగుందనేది కమలనాథులు భావిస్తున్నారు.


Also Read: Sharmila, Sunitha shocking comment: జగన్‌పై ఆగ్రహం, గొడ్డలితో నరికి చంపినప్పుడు..!

మరోవైపు టీడీపీ కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని కుండబద్దలు కొట్టేశారు టీడీపీ యువనేత నారాలోకేష్. ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన.. ఓటర్లు టీడీపీ, బీజేపీ, జనసేన వైపు ఉన్నారని చెప్పుకొచ్చారు. 175 అసెంబ్లీకు గాను 150 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే 23 ఎంపీ సీట్లలో కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగిస్తారని చెప్పుకొచ్చారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×