E-Paper
Advertisement

Nara lokesh: జగన్‌కి మంత్రి నారా లోకేష్ కౌంటర్.. రెడ్ బుక్ డీటేల్స్ బయటకు..

Nara lokesh: జగన్‌కి మంత్రి నారా లోకేష్ కౌంటర్.. రెడ్ బుక్ డీటేల్స్ బయటకు..
Advertisement

Nara lokesh (AP political News) : మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్.. అందులో ఏముంది? జగన్ ఎందుకు భయపడు తున్నారు? పదేపదే జగన్ ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఏదో విధంగా అధికార ప్రభుత్వంపై బురద జల్లడానికేనా? టీడీపీ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది? ఆయా ప్రశ్నలకు సమాధానం బయటకు వచ్చేసింది.

వైసీపీ అధినేత జగన్ మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ రెడ్ బుక్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నా రు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని పదేపదే దుయ్యబడుతున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ నుంచి పెద్దగా కౌంటర్లు లేకపోవడంతో నేరుగా మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగేశారు. ఈ విషయంలో వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు తనదైనశైలిలో రిప్లై ఇచ్చేశారాయన.

Advertisement

శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేట ప్రాంతంలో అన్న క్యాంటీన్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆయన స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడా రు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిని వదిలేది లేదని ప్రచారంలో చెప్పానన్నారు.

ALSO READ: మాజీ మంత్రి రోజా పై సీఐడీ విచారణకు ఆదేశం

Advertisement

రెడ్ బుక్ విషయంలో ఊరూరూ వెళ్లి మాట్లాడనని వివరించారు. దీనిపై ప్రజలకు తాను హామీ ఇచ్చానన్నా రు. దానికి కట్టుబడి ఉన్నానని తెలియజేశారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు మాకు మంచి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. పనిలోపనిగా గత ప్రభుత్వం చేసిన కొన్ని అంశాలపై యాక్షన్ తప్పదన్నారు. ముఖ్యంగా లిక్కర్, ఇసుక దందాలు కొనసాగాయని చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు వ్యవహారం గురించి కీలక విషయాలు వెల్లడించారు మంత్రి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని, ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి.. ఆయా భూములను సొంతం చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత వాటిని అమ్మేశాడన్నారు. ఇలాంటి వాటిపై యాక్షన్ తీసుకోకూడదా? అంటూ ప్రశ్నించారు. ఇంకా లిక్కర్, ఇసుక దందాలపై చర్యలు తప్పవంటూ సంకేతాలు ఇచ్చేశారు.

ఒక అబద్దాన్ని పదేపదే చెబితే నిజం అవుతుందని జగన్ భావిస్తున్నారని అన్నారు మంత్రి నారా లోకేష్. అందుకే ఫేక్ జగన్ అని పేరు పెట్టామన్నారు. చివరకు అన్న క్యాంటీన్ల నిర్వహణకు వచ్చే విరాళాలపైనా ఆ పార్టీ ఏడుస్తోందని దుయ్యబట్టారు. సైకోల బారి నుంచి పేదలని రక్షించడానికే విరాళాలు సేకరిస్తున్నట్లు తెలియజేశారు. మొత్తానికి జగన్ చేసిన కామెంట్స్‌‌కు ఫుల్ స్టాప్ పెట్టారు మంత్రి నారా లోకేష్.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×