BigTV English

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌ సంక్షోభం.. టార్గెట్ హిందూవులేనా?

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌ సంక్షోభం.. టార్గెట్ హిందూవులేనా?

దాడులు చేశారు.. ఈ దాడుల్లో కొందరు మరణించారు కూడా.. నిజంగా సోషల్‌ మీడియాలో చూపించినంత దారుణమైతే కాదు కానీ అక్కడ ఉండే హిందువులపై దాడులు జరిగాయి. ఇది నిజం. అధికారిక లెక్కల ప్రకారమే.. దాదాపు 200 వరకు దాడులు జరిగాయి. ఇందులో ఇళ్లున్నాయి.. హిందూ ఆలయాలున్నాయి. అందుకే ప్రధాని నరేంద్రమోడీ తన ఇండిపెండెన్స్‌ స్పీచ్‌లో బంగ్లాదేశ్‌ గురించి మాట్లాడారు. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. దేశ ప్రజలు అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారన్నారు. కాబట్టి.. తన స్టేట్‌మెంట్‌తో బంగ్లాదేశ్‌కు ఓ మెసేజ్‌ను అయితే పంపారు మోడీ.

ఇది ప్రస్తుతం.. కాస్త భూతకాలానికి వెళ్దాం.. అదే పాస్ట్‌కి.. 2022 సెన్సన్ ప్రకారం బంగ్లాదేశ్‌ జనాబా 16 కోట్ల 50 లక్షలు.. ఇందులో 91.08 శాతం ముస్లింలు ఉన్నారు. ఒక శాతంలోపే క్రిస్టియన్, బుద్దీస్ట్‌ల జనాభా ఉంటుంది. ఇక హిందువూల జనాభా వచ్చేసరికి కోటి 31 లక్షల 44 వేల 204 మంది. అంటే మొత్తం జనాభాలో హిందువుల పర్సంటేజ్‌ 7.96.. 1901 నుంచి 2022 వరకు జనాభా లెక్కలు చూస్తే.. ఆ దేశంలో హిందువుల జనాభా తగ్గుతూ వస్తుంది. అది కూడా గణనీయంగా.. 1901లో 33 శాతం ఉండేది ఈ రీజియన్‌లో హిందువుల జనాభా..


అంటే అప్పుడు మన దేశానికి స్వాతంత్ర్యం రాలేదు.. అసలు ఆ దేశమే లేదు కదా అంటారా.. ఇక్కడ ఆ ప్రాంతంలో ఉండేవారి నెంబర్స్‌ను మాత్రమే మనం చూస్తున్నాం. సరే ఆ దేశం ఏర్పడిన తర్వాత అంటే 1981లో సెన్సన్ నిర్వహించే సరికి ఆ దేశంలో జనాభా 12.1 శాతానికి పడిపోయింది. 1991 వచ్చేసరికి 10.5 శాతానికి.. 2001 వచ్చేసరికి 9.6 శాతానికి.. 2011లో 8.5 శాతానికి.. 2022 వచ్చేసరికి 7.96 శాతానికి పడిపోయింది. అంటే ఆ దేశంలో హిందువుల జనాభా క్రమక్రమంగా పడిపోతూ వస్తుంది.

Also Read: మార్క్ జుకర్‌బర్గ్ గిఫ్ట్, షాకైన వైఫ్.. ఎందుకు?

ఓ వైపు హిందువుల జనాభా తగ్గుతూ వస్తుంటే.. ముస్లింల జనాభా మాత్రం గణనీయంగా పెరుగుతూ పోయింది. ఇక్కడ ముస్లింల జనాభా 91 శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇలా జరగడానికి అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి. విభజన.. ప్రత్యేక దేశంగా ఏర్పడటం.. స్థానికంగా ఉన్న సమస్యలు.. ఆర్థిక స్థితిగతులు.. పేదరికం.. జనాభా పెరుగుదలపై కంట్రోల్‌ లేకపోవడం.. ఇలా అనేక కారణాలున్నాయి. ఓవరాల్‌గా చూస్తే పాలన ఎవరిదైనా.. హిందువుల జనాభా తగ్గిపోతూ ఉండటం మాత్రం ఆగడం లేదు.

మళ్లీ ప్రసెంట్‌కు వద్దాం.. నిజానికి హసినా దేశాధినేతగా ఉన్నప్పుడు ఇండియాతో సత్సంబంధాలు కొనసాగించారు. ఆమె ఇండియాకు చాలా క్లోజ్.. ఈ స్టేట్‌మెంట్‌ ఆ దేశంలో కొందరు అతివాదులకు అస్సలు నచ్చలేదనే చెప్పాలి. ఆమెపై ఉన్న కోపాన్ని కూడా కొన్ని హిందూ కుటుంబాలపై వెళ్లగక్కినట్టు కూడా తెలుస్తోంది. అయితే అవామీ లీగ్.. అంటే హసినా పార్టీతో సంబంధాలు ఉన్న హిందువూలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఈ దాడులన్ని రాజకీయపరమైనవే తప్ప.. మతపరమైనవి కాదన్నది మరో వాదన.. కాబట్టి .. ఇలా ఎవరి వాదనలు వారివి కారణాలు ఏవైనా దాడులైతే జరిగాయి.

ఈ దాడులేమో కానీ.. బంగ్లాదేశ్‌లో మాత్రం హిందువూల జనాభా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. గణంకాలు చెబుతున్నది ఇదే.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే జరిగింది.. జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. నెక్ట్స్‌ సెన్సన్ వరకు ఈ సంఖ్య మరింత భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం దాడులు కావొచ్చు.. అక్కడున్న మైనారీల్లో నెలకొన్న భయం కావొచ్చు.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×