Narsi Reddy Speech : నన్నూరి నర్సిరెడ్డి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు సభ్యులు. మాటల మాంత్రికుడు. జబర్దస్త్‌ను మించిన పంచ్‌లు. తెలంగాణ యాసలో మాటల తూటాలు వదులుతారు. మహానాడులో ఆయన స్పీచ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రాసలు, పంచ్‌లతో ఇరగదీస్తారు. పొగడటంలో, తిట్టడంలో ఆయనకు ఆయనే సాటి. నర్సిరెడ్డి మైక్ పట్టుకున్నారంటే.. అంతా అటెన్షన్‌లోకి వచ్చేస్తారు. ఆయన ప్రసంగం ఆసాంతం ఆసక్తిగా, కామెడీగా, పవర్‌ఫుల్‌గా సాగుతుంటుంది. కడపలో జరుగుతున్న మహానాడులోనూ 10 నిమిషాల పాటు ప్రాంగణంను దద్దరిల్లేలా చేశారు నర్సిరెడ్డి.
దాడులు, ఎదురు దాడులు..
భారత రాజకీయ ధృవతార, మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి అంటూ స్టార్ట్ చేశారు. నిందలు, అపనిందలు.. దాడులు, ఎదురు దాడుల మధ్య ఎదిగి.. యువగళమై, నవగళమై.. జన బలంతో సాగుతున్న.. మన నేత, యువ నేత నారా లోకేశ్ గారికి నమష్కారాలు అనగానే ప్రాంగణమంతా చప్పట్లలో మారుమోగిపోయింది.
టీడీపీ బలం ఇదే..
చెట్టు మీద కూర్చున్న పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు, రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని, బలగాన్ని నమ్ముకుంటుంది కాబట్టే.. కార్యకర్తలే మన పార్టీకి ఇంధనం.. అందుకే మీకు నా తొలి వందనం అంటూ జోరు పెంచారు. ఆ తర్వాత నర్సిరెడ్డి స్టైల్ పంచ్ పటాకాలా పేలింది.
కేసీఆర్, జగన్‌లపై పంచ్‌లు..
మా కాడ ముక్కోడు పోయిండు.. మీ కాడ తిక్కోడు పోయిండు.. అంటూ కేసీఆర్, జగన్‌లను ఉద్దేశించి డైలాగ్ కొట్టగానే అంతా పడిపడి నవ్వారు. ఇవాళ ముక్కాయనేమో లిఫ్ట్ ఇరిగేషన్.. తిక్కాయనేమో ఆత్మల తోటి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటూ సెటైర్లు వేశారు.
నాన్‌స్టాప్ డైలాగ్స్
జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం అంటూ మహానాడు వేదికపై “తెలుగు జాతి – విశ్వ ఖ్యాతి” తీర్మానాన్ని బలపరిచారు నన్నూరి నర్సిరెడ్డి. నారా అంటే రారా అంటూ ప్రజానీకం పిలుస్తోందని.. రామన్న రూపుదిద్దిన పార్టీని.. చంద్రన్న తీర్చిదిద్దారన్నారు నర్సిరెడ్డి. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని లెక్కలతో సహా అనర్గళంగా వివరించడంతో.. ఆ నాన్‌స్టాప్ ఫ్లో కు అంతా అవాక్కై విన్నారు. 10 నిమిషాల పాటు సాగిన నర్సిరెడ్డి ప్రసంగం మహానాడుకు అట్రాక్షన్‌గా నిలిచింది.