BigTV English

Mirai Teaser: ‘మిరాయ్’ను చూసి నేర్చుకోండి.. ‘వార్ 2’పై దారుణమైన ట్రోల్స్, కారణం ఇదేనా?

Mirai Teaser: ‘మిరాయ్’ను చూసి నేర్చుకోండి.. ‘వార్ 2’పై దారుణమైన ట్రోల్స్, కారణం ఇదేనా?

Mirai Teaser: మంచి కాన్సెప్ట్ సినిమాలకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు మంచి ఆదరణ లభిస్తుంది. చాలా చిన్న సినిమాలు మంచి కాన్సెప్ట్ కలిగి ఉండడంతో మంచి సక్సెస్ కూడా చూసాయి. 2024 సంక్రాంతి సీజన్ కి సంబంధించి బాక్స్ ఆఫీస్ వద్ద మూడు పెద్ద సినిమాలతో విడుదలైన ఒక చిన్న సినిమా అనేక సంచలనాలు సృష్టించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. అలానే వెంకటేష్ నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోలు సినిమాలు కూడా పోటీలో దిగాయి. అయితే వీటన్నిటిని మించి తేజ నటించిన హనుమాన్ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. చాలామంది పిల్లలకు ఈ సినిమా ఫేవరెట్ అయిపోయింది. అద్భుతమైన కలెక్షన్స్ కూడా వసూలు చేసింది.


హనుమాన్ స్థాయిలో మిరాయ్

ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా పెద్ద బడ్జెట్ లేకపోయినా కూడా హై క్వాలిటీ గ్రాఫిక్స్ చూపించారు. ఇప్పుడు దాదాపు 60 కోట్లు బడ్జెట్ పెట్టిన మిరాయ్ సినిమాలో కూడా అదే స్థాయిలో గ్రాఫిక్స్ ఉన్నాయి. ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా టీజర్ విడుదలైనప్పుడు చాలా ట్రోల్స్ కి గురి అయింది. అప్పుడు ఆ టీజర్ను చాలామంది హనుమాన్ టీజర్ తో కంపేర్ చేసి ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 సినిమా టీజర్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇదివరకే వార్ 2 టీజర్ పై ట్రోలింగ్ ఉంది. ఇప్పుడు మిరాయ్ టీజర్ విడుదలైన తర్వాత ఆ ట్రోలింగ్ ఇంకా పెరిగింది. 200 కోట్లు బడ్జెట్ ఖర్చుపెట్టి కూడా వార్ కంటెంట్ సినిమా నాసిరకంగా ఉంది. కేవలం 60 కోట్ల లోని మంచి క్వాలిటీ కంటెంట్ అందించారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


అంచనాలు పెంచిన మిరాయ్

ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో మిరాయ్ ఒకటి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే ఇదే బ్యానర్ లో ఈగల్ అనే సినిమా తెరకెక్కించాడు కార్తీక్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను మరోసారి చూపించబోతున్నాడు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే మంచు మనోజ్, తేజ సజ్జ పాత్రలను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి మంచి కథాంశాన్ని కూడా పొందుపరిచినట్లు టీజర్ అనిపిస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ ఐదున రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×