BigTV English

Bird Flu in Chittoor District: చిత్తూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం.. ఆందోళనలో పౌల్ట్రీ రైతులు

Bird Flu in Chittoor District: చిత్తూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం..  ఆందోళనలో పౌల్ట్రీ రైతులు
Bird Flu in Chittoor District

Nellore Bird Flu Effect In Chittoor Poultry Industry(AP latest news): నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన బర్డ్ ప్లూ ఇప్పుడు చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు జిల్లాకు పక్కనే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉంది. ఈ ప్రాంతంలో పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతుల సంక్షోభంలో పడ్డాయి. జిల్లాలో పౌల్ట్రీ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల క్రితం నెల్లూరు జిల్లా పొదలకూరులో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూసింది.


ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పౌల్ట్రీ బిజినెస్‌ను బర్డ్ ఫ్లూ వైరస్ దారుణంగా దెబ్బతీస్తోంది. రోజువారీగా బెంగళూరు, పాండిచ్చేరి, చెన్నై తదితర ప్రాంతాలకు కోళ్లు, కోడిగుడ్లును చిత్తూరు జిల్లాలోని హేచరీస్ సంస్థలు ఎగుమతులు చేస్తున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో హేచరీస్ సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జిల్లాలోని పౌల్ట్రీ ఉత్పత్తులను తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు అనుమతించడంలేదు. దీంతో బార్డర్ చెక్ పోస్టుల వద్దే పౌల్ట్రీ రంగం ఉత్పత్తుల రవాణ వాహనాలు నిలిచిపోతున్నాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు, 7 లక్షల పెరటి కోళ్లు పెంపకం చేపడుతున్నారు. దీంతీ ఏడాదికి రూ. 800 కోట్ల మేర పౌల్ట్రీ సంస్థలకు బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి 37, 089 మెట్రిక్ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడిగుడ్లను హేచరీస్ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. రోజువారీగా రూ. 5 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రూ.5 కోట్ల వ్యాపారం ఆగిపోతోందంటూ ఫౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Read More: ఇక విచారణ లేదు.. డైరక్ట్ యాక్షన్‌..

మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ పై చిత్తూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 31 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేశారు. జిల్లాలో పీపీఈ కిట్లు, క్రిమిసంహారక మందులు అందుబాటులోకి తెచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 వేల మంది రైతులు పౌల్ట్రీ రంగంపై ఆధారపడ్డారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా నుంచి కోళ్ల ఎగుమతులను నిషేధించారు. బర్డ్ ఫ్లూ వైద్యం లేదు. టీకా కూడా అందుబాటులో లేదు. ఈ వైరస్ ను నియంత్రించడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. పశువైద్య అధికారులు ఈ వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Related News

YS Raja Reddy: రాజారెడ్డికి అమ్మమ్మ ఆశీర్వాదం.. తల్లితోపాటు అక్కడికి, జగన్ టీమ్‌లో కలకలం

CM Progress Report: ఏపీలో ఫేక్ న్యూస్‌పై ఫైట్ షురూ.. సీఎం సంచలన నిర్ణయం..

Road accident: మద్యం మత్తులో కారు డ్రైవర్.. ఏకంగా ముగ్గురి ప్రాణాలు బలి.. విజయనగరంలో ఘటన!

Hindu temples: గ్రహణంలోనూ తెరిచి ఉన్న ఏకైక ఆలయం.. ఏపీలో ఉందని మీకు తెలుసా!

Tirumala News: నేడు శ్రీవారిని దర్శించిన భక్తులెందరో తెలుసా? రేపటికి టీటీడీ సిద్ధం!

Visakhapatnam fire: పిడుగు పడి పేలిన పెట్రో ట్యాంక్.. విశాఖలో కలకలం!

Big Stories

×