Devi Sri Prasad : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవిశ్రీప్రసాద్ ఒకరు. దేవి మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలతో దేవిశ్రీప్రసాద్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాకుండా కేవలం తన మ్యూజిక్ తో ఎన్నో సినిమాలను నిలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే అందరూ టీజర్ ట్రైలర్ చూసి సినిమా వరకు వస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం సినిమా మీద ఒక బజ్ క్రియేట్ అవ్వాలి అంటే అది కంప్లీట్ గా మ్యూజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా దేవిశ్రీ మ్యూజిక్ వలన సినిమా మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ కలిగిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా శంకర్ దాదా ఎంబిబిఎస్, జల్సా, మిర్చి వంటి సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతం పెద్ద ప్లస్ పాయింట్ అయింది. దేవి మ్యూజిక్ వలనే ఆయా సినిమాలు మీద అంచనాలు కూడా పెరిగాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన జల్సా సినిమా పాటలు అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఆ పాటలు ఒక మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తాయి. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులతో దేవిశ్రీప్రసాద్ కి మంచి అనుబంధం ఉంది. అయితే సుకుమార్ తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు సుకుమార్ చేసిన ప్రతి సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అలానే సుకుమార్ సినిమా అంటే దేవి శ్రీ ప్రసాద్ పూనకం వచ్చినట్లు పనిచేస్తారు. బెస్ట్ మ్యూజిక్ ను సుకుమార్ సినిమా కోసం అందిస్తారు. ఒక సందర్భంలో వన్ నేనొక్కడినే అనే సినిమాకి అతి తక్కువ రోజుల్లోనే అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు దేవి. ఇకపోతే ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ పుష్ప సినిమాకి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం పుష్ప సినిమాకి దేవిశ్రీ మాత్రమే కాకుండా ఇంకో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ను కూడా తీసుకున్నట్లు సమాచారం వినిపిస్తూ వచ్చింది. తమన్ కూడా దీనిని కన్ఫామ్ చేశాడు.
Also Read : Pushpa Kissik Song :సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది
తాజాగా దీనిపైన దేవిశ్రీప్రసాద్ ఇన్ డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు అనిపిస్తుంది. ప్రస్తుతం పుష్ప సినిమా ఐటెం సాంగ్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరుగుతుంది. ఈ ఈవెంట్లో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ అభిమానులు ఉద్దేశిస్తూ తమ్ముడు మనకే కావాల్సింది అడిగి తీసుకోవడంలో తప్పులేదు. మనకి ఏం కావాలన్నా మనం అడిగి తీసుకోవాలి.. అడగకపోతే ఎవరు ఇవ్వరు.. కరెక్టే కదా బన్నీ! అది ప్రొడ్యూసర్స్ దగ్గర పేమెంట్ అయినా.. స్క్రీన్ మీద వచ్చే మన క్రెడిట్ అయినా..! అని ఇన్డైరెక్టుగా ఈ ఇష్యూ పైన రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా.. టైం కి పాట ఇవ్వలేదు,టైం కి బీజీమ్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా లేట్ గా వచ్చా అన్నారు. మైత్రి రవి గారు అంటూ స్టేజ్ పైనే పంచాయతీ పెట్టేసాడు. చాలామందికి ఈ స్పీచ్ ఇప్పుడు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇక దేవి మాట్లాడిన ఈ మాటలు ఏ స్థాయిలో వైరల్ అవుతాయో ఊహించలేము.