BigTV English

NTPC Green Energy IPO: మరో గుడ్ న్యూస్.. ఏపీలో ఎన్టీపీసీ రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడులు

NTPC Green Energy IPO: మరో గుడ్ న్యూస్.. ఏపీలో ఎన్టీపీసీ రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడులు

NTPC Green Energy IPO: ఇంధన రంగంలో ఏపీని అగ్రగామిగా మలిచేందుకు సీఎం చంద్రబాబు కీలక ముందడుగు వేశారు. చంద్రబాబు చొరవతో ఏపీలో NTPC భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులకు సిద్ధమైంది NTPC. 1.87 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు NTPC రెడీ అయ్యింది. దీంతో వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి 20 వేల 620 కోట్ల ఆదాయం రానుంది. 1 లక్షా 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన NREDCకి NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు మధ్య ఒప్పందం జరిగింది.


సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుంటుందని సీఎం అన్నారు. భవిష్యత్ అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనన్నారు సీఎం. ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ ను 2027 ఏప్రిల్ మే నాటికి పూర్తి చెయ్యాలని సీఎం తెలిపారు. కాలుష్య రహిత ఇంధన వనరుల ఉత్పత్తికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు.

Also Read:  ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి మూడు నెలల నగదు.. మరో విశేషం ఏమిటంటే?


ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 78.50 గిగా వాట్ల సౌరశక్తి, 35 గిగా వాట్ల పవన శక్తి, 22 గిగా వాట్ల పంప్డ్ స్టోరేజీ, 1.50 MMTPA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ క్రమంలో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీరడంతో పాటు భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు.

రాష్ట్రంలో NTPC భారీ పెట్టుబడులపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నూతన ICE విధానాల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయన్నారు. ఏపీ క్లీన్‌ ఎనర్జీ హబ్‌గా ఎదిగేందుకు మార్గం సుగమైందని ఎక్స్‌​లో పేర్కొన్నారు. NTPC పెట్టుబడులతో లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×