E-Paper
Advertisement

Nuclear Power Plant in Ap: నాలుగు న్యూక్లియర్ పవర్‌ ప్లాంట్లు.. ఏపీ సహా ఆయా రాష్ట్రాల్లో

Nuclear Power Plant in Ap: నాలుగు న్యూక్లియర్ పవర్‌ ప్లాంట్లు.. ఏపీ సహా ఆయా రాష్ట్రాల్లో
Advertisement

Nuclear Power Plant in Ap: రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఎన్టీపీసీ. దీనికి సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని అవసరమైన ప్రాంతాల కోసం సెర్చింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అందులో ఏపీకి ఉన్నట్లు సమాచారం.

నాలుగు న్యూక్లియర్ పవర్‌ ప్లాంట్ల నిర్మాణం

Advertisement

రోజు రోజుకూ విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి. అందుకు సరిపడినట్టుగా ఉత్పత్తి ఉండడం లేదు. ఆ దిశగా ప్రణాళికలు మొదలయ్యాయి. 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తి సాధించాలని కేంద్రం ప్లాన్ చేసింది. అందులో 30 శాతం వాటా సాధించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది.

కేవలం ఒక గిగావాట్‌ అణు విద్యుత్‌ ప్లాంటు కోసం దాదాపు 15 వేల నుంచి 20 వేల కోట్లు పెట్టుబడి అవసరం. నిర్మాణం నుంచి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించడానికి ఎలాగలేదన్నా కనీసం మూడేళ్లు పడుతుందని ఆ సంస్థ ఓ అంచనా.  దేశంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తోంది.

Advertisement

ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు?

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 700 మెగావాట్లు నుంచి 1600 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్రాజెక్టులకు నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేస్తోంది. వాటిలో ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతాల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు-AERB ఆయా ప్రాంతాలను గుర్తించనుంది. అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో బోర్డు సూచనలకు అనుగుణంగా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఆయా ప్లాంట్ల కోసం ముడి పదార్థాల సమీకరణపై ఎన్‌టీపీసీ ఫోకస్ చేసింది. అణు విద్యుత్తుకు కీలకమైన యురేనియం సమీకరణకు విదేశాల్లో ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఎన్టీపీసీ ఒప్పందం చేసుకుంది.

ALSO READ:  సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్..  పెట్టుబడులు ఎన్నివేల కోట్లంటే

దేశీయంగా 84,848 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగివుంది ఎన్‌టీపీసీ. అందులో బొగ్గు, గ్యాస్‌, హైడ్రో, సౌర విద్యుత్ వంటి ప్లాంట్లు ఉన్నాయి. రాజస్థాన్‌లో న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌తో కలిసి రూ.42,000 కోట్లతో అణు విద్యుత్తు ప్లాంట్‌ని నిర్మిస్తోంది. 1975లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ స్థాపించింది. ఆ తర్వాత క్రమంగా వివిధ రాష్ట్రాల్లో పవర్ ప్లాంట్లను విస్తరించింది.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×