Hero Nikhil: హీరో, హీరోయిన్లు టెక్నాలజీ వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడడం తరచుగా చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వారి ముఖాలను ఉపయోగించి ఈ టెక్నాలజీకి తమను బాధితులుగా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అలాంటి ఇప్పటివరకు ఎంతోమంది సినీ సెలబ్రిటీలు టెక్నాలజీ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు. తాజాగా యంగ్ హీరో నిఖిల్.. మస్తాన్ సాయి కేసు విషయంలో పలు ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. తాజాగా అసలు మస్తాన్ సాయి ఫోన్‌లో ఉన్న వీడియోల్లో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇచ్చేశాడు నిఖిల్. అంతే కాకుండా ఇందులో తన తప్పు ఏమీ లేదని చెప్తూ ఆ వీడియోల గురించి వివరణ ఇస్తూ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేశాడు.
నిఖిల్ క్లారిటీ
మస్తాన్ సాయి అనే వ్యక్తిపై రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య అనే ఫిర్యాదు చేసింది. దీంతో అసలు మస్తాన్ సాయి ఎవరు అనే విషయం బయటపడింది. పోలీసులు తనను అదుపులో తీసుకొని తన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్స్, హార్డ్ డ్రైవ్‌లో చూస్తే అసలు విషయం బయటపడింది. ఆ హార్డ్ డ్రైవ్‌లో ఎన్నో వందల మంది మహిళల న్యూడ్ వీడియోలు బయటపడ్డాయి. అందులో కొందరు అప్‌కమింగ్ నటీమణులు కూడా ఉన్నారు. అంతే కాకుండా ఈ వీడియోలు అన్నింటి మధ్య పోలీసులకు మరొక వీడియో కూడా దొరికింది. అందులో ఉన్నది హీరో నిఖిల్. ఈ విషయం బయటపడడంతో తెలుగు సినీ ప్రేక్షకులంతా షాకయ్యారు. అసలు దీని వెనుక ఏం జరిగిందో క్లారిటీ ఇవ్వడానికి తాజాగా నిఖిల్ ముందుకొచ్చాడు.
కుటుంబ సభ్యులే
మస్తాన్ సాయి హార్డ్ డ్రైవ్‌లో ఉన్న తన వీడియోలు బయటపడినప్పటి నుండి తనపై జరుగుతున్న ప్రచారాలు సరైనవి కాదని ఖండించాడు నిఖిల్ (Nikhil). అసలు ఆ వీడియోలు అలాంటివి కాదని, తను తన కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను టెక్నాలజీ సాయంతో తప్పుగా మార్చారని చెప్పుకొచ్చాడు. తను హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమా సక్సెస్ మీట్ అయిన తర్వాత జరిగిన డిన్నర్ పార్టీకి సంబంధించిన వీడియోలు కూడా అందులో ఉన్నాయని, వాటినే తప్పుగా మార్చి చూపించారని వాపోయాడు. ఆ వీడియోల్లో ఉన్నది తన కుటుంబ సభ్యులే అని స్పష్టం చేశాడు నిఖిల్. దీంతో ఫ్యాన్స్‌లో మరోసారి ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి.
Also Read: ‘తండేల్’లో ఆ అంశాన్ని వాడుకోలేకపోయిన దర్శకుడు.. అంచనాలు తారుమారు..
లావణ్య వల్లే బయటికి
మస్తాన్ సాయి (Masthan Sai) కేసు విషయంలో తన తప్పేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. ప్రస్తుతం మస్తాన్ సాయి జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. చాలామంది సినీ సెలబ్రిటీలతో, మరికొందరు పాపులర్ వ్యక్తులతో మస్తాన్‌కు కాంటాక్ట్స్ ఉన్నాయి. అలా దొంగచాటుగా వందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలను తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసేవాడు మస్తాన్ సాయి. కానీ అందులో ఒక్కరు కూడా ఫిర్యాదు చేయకపోవడంతో ఈ విషయం అస్సలు బయటికి రాలేదు. ఫైనల్‌గా రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి అయిన లావణ్య వీడియోలను కూడా మస్తాన్ సాయి తీయగా.. తను ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. అంతే కాకుండా మస్తాన్ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నాడని తాజాగా బయటపడింది.