AP Annadata alert: మీ ఖాతాలోకి రావాల్సిన సాయం ఆగిపోనుంది? రాష్ట్రంలోని లక్షల మంది రైతులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. కారణం ఒక్కటే.. చాలా మంది క్షణాల్లో అర్హత కోల్పోతున్నారు. ఎందుకు అని తెలుసుకుంటే, మీరు కూడా ఒక్కసారి మీ వివరాలు చెక్ చేసుకోకుండా ఉండలేరు. ప్రభుత్వం నేరుగా డబ్బులు పంపిస్తున్న పథకంలో మీ పేరు మిస్ అవుతుందా? ఒక్క చిన్న తప్పు వల్ల మీ డబ్బు ఎలా మిస్సవుతోంది తెలుసుకోండి.
ఏపీ రైతులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,21,682 మంది రైతులకు స్కీమ్ వర్తించని పరిస్థితి ఉంది. వ్యవసాయ శాఖ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు మూడు.. బ్యాంకు ఖాతా NPCI మ్యాపింగ్ లో లేకపోవడం, ఖాతాలు INACTIVE, లేదా ఈకేవైసీ పూర్తి చేయకపోవడం. రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడమే ఈ పథకం లక్ష్యంగా ఉండటంతో, NPCI మ్యాపింగ్ తప్పనిసరి. మ్యాపింగ్ లేకుంటే డబ్బు జమయ్యే అవకాశం ఉండదు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 47.41 లక్షల మంది రైతులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. వీరి వివరాలను RTGS వ్యవస్థ ద్వారా NPCIతో పోల్చగా, రెండు కీలక సమస్యలు బయటపడ్డాయి. మొదటిది.. 76,705 మంది రైతుల బ్యాంకు ఖాతాలు క్రియాశీలకంగా లేవని గుర్తించారు. అంటే, వీరి ఖాతాల్లో ఎటువంటి లావాదేవీలు జరగలేదు.
వీరు వెంటనే బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి eKYC అప్‌డేట్ చేయించుకోవాలి. లేకుంటే చిన్న మొత్తంలో అయినా లావాదేవీ జరపాలి. రెండవ సమస్య.. 44,977 మంది రైతుల వివరాలు NPCIలో కనిపించలేదు. వీరి బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో లింక్ అయి ఉండకపోవచ్చు. వీరు ఆధార్ లింకింగ్ పూర్తిచేసి, NPCI మ్యాపింగ్ చేయించుకోవాలి.
ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు దగ్గరలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. అక్కడే వారి eKYC పూర్తైందా, ఖాతా NPCIలో మ్యాప్ అయిందా అన్నదాని వివరాలు తెలుస్తాయి. అవసరమైతే గ్రామ వ్యవసాయ అధికారులను కలవచ్చు. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని ప్రతి అర్హత గల రైతుకీ ఈ పథకం మేలు చేకూరాలని సూచిస్తూ, వ్యవసాయ అధికారులు ప్రతి ఒక్కరిని గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. RTGS, APCFSS వ్యవస్థలు ఈ డేటాను సమీక్షించి తుది లబ్ధిదారుల జాబితాను రూపొందించనున్నాయి.
రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. మొదటగా, తమ బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయిందా అని చెక్ చేసుకోవాలి. ఖాతా INACTIVE గా ఉంటే.. ఒక చిన్న మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలి. అలాగే eKYC పూర్తయిందా లేదా అన్నది రైతు సేవా కేంద్రంలో నిర్ధారించుకోవాలి. NPCI మ్యాపింగ్ లేకుండా అన్నదాత సుఖీభవ స్కీమ్ లబ్ధిని పొందలేరు.
ఇది తక్షణమే చేయాల్సిన ప్రక్రియ. ఆలస్యం చేస్తే అర్హత ఉన్నా లబ్ధి పొందే అవకాశం కోల్పోతారు. ఇది మీ హక్కు. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోండి. మీ పక్కనే ఉన్న రైతులకూ ఈ విషయం తెలియజేయండి. అయితే ఈ స్కీమ్ లో భాగంగా త్వరలో మొదటి విడతగా 6 వేలు జమ కానున్న విషయం తెల్సిందే. మరెందుకు ఆలస్యం.. వచ్చే డబ్బులు పోగొట్టుకోవద్దు.. వెంటనే బ్యాంక్ ను సంప్రదించండి.