BigTV English
Advertisement

YCP : వైసీపీకి విశాఖ జిల్లా అధ్యక్షుడు షాక్.. పార్టీకి రాజీనామా..

YCP : వైసీపీకి విశాఖ జిల్లా అధ్యక్షుడు షాక్.. పార్టీకి రాజీనామా..

YSRCP latest news today(AP political news) : విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షాక్‌ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు జిల్లా అధ్యక్ష పదవితోపాటు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పెందుర్తి టికెట్ విషయంలో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ వీడుతున్నానని ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.


ఏడాదిగా ఎన్నో సమస్యలను సీఎం వైెఎస్ జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానని పంచకర్ల తెలిపారు. కానీ సీఎంకు చెప్పేందుకు వీలు కాలేదని వివరించారు. కిందిస్థాయి సమస్యలు తీర్చలేనపుడు పదవిలో ఉన్నాలాభమేంటని ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో పంచకర్ల రమేశ్ బాబుకు విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపైనా ఆయన స్పందించారు. వైవీ సుబ్బారెడ్డితో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు.

పంచకర్ల రమేష్‌ బాబు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత కొంతకాలం ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో అక్కడ నుంచే టీడీపీ నుంచి బరిలోకి దిగి.. వైసీపీ అభ్యర్థి కన్నబాబు రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి 2021 ఆగస్టు 28న సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇప్పుడు పంచకర్ల తిరిగి టీడీపీలో చేరతారా? జనసేన వైపు చూస్తారా అనేది ఆసక్తిగా మారింది.


Related News

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

Big Stories

×