BigTV English

Paritala Case : పరిటాల రవీంద్ర హత్య కేసులో భానుకు బెయిల్.. 12 ఏళ్లకు స్వల్ప ఊరట

Paritala Case : పరిటాల రవీంద్ర హత్య కేసులో భానుకు బెయిల్.. 12 ఏళ్లకు స్వల్ప ఊరట

Paritala Case : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి హత్యే కేసులో ప్రధాన దోషి మలిశెట్టి భాను కిరణ్.. అలియాస్ భానుకు బెయిల్ మంజూరైంది. 2011లో సూరి హత్యకు గురికాగా.. 2018లో భానును నాంపల్లి మొదటి అదనపు సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కింద.. భాను నేరానికి పాల్పడ్డాడు అని తేల్చిన కోర్టు.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో.. 12 ఏళ్లుగా భాను చంచల్ గూఢ జైలులోనే ఉంటున్నాడు. కాగా.. ఇప్పుడు బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల కానున్నాడు.


సూరి హత్య కేసులో తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్న భాను కిరణ్.. సుప్రీం కోర్టులో అపీల్ చేశాడు. దీనిపై విచారించిన సుప్రీం.. స్థానిక కోర్టులో తేల్చుకొమని ఆదేశించింది. దాంతో.. మళ్లీ స్థానిక కోర్టును ఆశ్రయించగా, ఈ నెల 11న విచారణ జరగనుంది.

భానుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు.. అతని ప్రైవేటు గన్‌మన్‌ మన్మోహన్‌సింగ్‌ బదౌరియాకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. భానుకిరణ్‌కు ఐపీసీ సెక్షన్‌ 307 కింద యావజ్జీవ శిక్షతో పాటు, నిషేధిత ఆయుధాలను వినియోగించినందుకు ఆయుధ చట్టంలోని సెక్షన్‌ 27 (2) కింద పదేళ్ల కఠిన కారాగారశిక్ష అమలు చేయాలని ఆదేశించింది.


మద్దెలచెర్వు సూరిని2011 జనవరి 3న తన ప్రధాన అనుచరుడు మల్లిశెట్టి భానుకిరణ్‌ హత్య చేశాడు. సూరితో పాటు కారులో ప్రయాణిస్తూ.. యూసఫ్‌గూడ దగ్గరకు రాగానే.. తనవద్ద ఉన్న 0.32 ఎంఎం తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి పారిపోయాడు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ.. సూరితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, అంతర్గత శతృత్వమే హత్యకు ప్రధాన కారణంగా తేల్చిన కోర్టు.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×