ప్రవీణ్ మృతికి ముందు ఆయన ప్రయాణం చేసిన మార్గంలో అనేక వీడియోలు ఇప్పుడు బయటికి వచ్చాయి. హైదరాబాద్ నుంచి బైక్‌పై బయల్దేరిన ప్రవీణ్ కుమార్.. విజయవాడకు చేరుకోకముందే ప్రమాదానికి గురయ్యారు. కీసర టోల్‌గేట్ దగ్గర యాక్సిడెంట్ అయ్యాక.. పగిలిన హెడ్‌లైట్‌తోనే బైక్ నడుపుకుంటూ ప్రవీణ్ ముందుకెళ్లారు. గుంటుపల్లి సిగ్నల్ దగ్గర ఆయనకు మరోసారి ప్రమాదం తప్పింది. అక్కడ కాసేపు ఆగి మళ్లీ బయలుదేరినా… బైక్ నడపడానికి ప్రవీణ్ ఇబ్బంది పడ్డారు. సిగ్నల్ వద్ద కాళ్లతో బైక్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లారు.మరోవైపు.. ఏలూరు దగ్గరి మద్యం దుకాణం సీసీ ఫుటేజ్‌కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ యాక్సిడెంట్ తర్వాత పగిలిన హెడ్‌లైట్‌తోనే బైక్ నడుపుకుంటూ ప్రవీణ్ ముందుకెళ్లారు. గుంటుపల్లి సిగ్నల్ దగ్గర ఆయనకు మరోసారి ప్రమాదం తప్పింది. అక్కడ కాసేపు ఆగి మళ్లీ బయలుదేరినా… బైక్ నడపడానికి ప్రవీణ్ ఇబ్బంది పడ్డారు. సిగ్నల్ వద్ద కాళ్లతో బైక్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లారు.
అలా కష్టపడుతూ గొల్లపూడి ప్రెటోల్‌బంక్‌కు సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు ప్రవీణ్ చేరుకున్నారు. అప్పటికే బైక్ హెడ్‌లైట్ ఊడిపోయి వేలాడుతోంది. బైక్ నడపడంలో పాస్టర్ ప్రవీణ్ ఇబ్బంది పడ్డట్లు కనిపించారు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత పాస్టర్ ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బంక్ నుంచి బయటికి వచ్చేప్పుడు కూడా ఆయన బైక్‌ను నడిపిన విధానం చూస్తే.. ఆయనకు అస్సలు ఓపిక లేనట్టే కనిపించింది. పెట్రోల్‌బంక్ నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నారు. 5 గంటల 20 నిమిషాలకు రామవరప్పాడు రింగ్‌కు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్‌ఐ సుబ్బారావు అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి ఎన్నిమిదిన్నర గంటల వరకు ఆయన పార్క్‌లోనే రెస్ట్ తీసుకున్నారు.
Also Read: కీసరలోనే ప్రవీణ్‌కు ఫస్ట్ యాక్సిడెంట్.. మరో సీసీ కెమెరా ఫుటేజ్
ఈ పరిణామాలన్ని చూస్తుంటే ఆయన విజయవాడలో ఆ రోజు ఆగి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని అనిపిస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటరైన తర్వాత ఆయన బైక్ రెండు సార్లు ప్రమాదానికి గురైంది. మొత్తానికి ఆయన మూడు గంటల మిస్టరీని అయితే పోలీసులు చేధించారు. మరిన్ని విషయాలపై ఫోకస్ చేశారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఓ వైపు ఉద్రిక్తతలు పెరగకుండా.. తప్పుడు ప్రచారం జరగకుండా చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు ఆయన డెత్ మిస్టరీని వేగంగా చేధిస్తున్నారు పోలీసులు.