Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన మారింది. అయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎలా చనిపోయారు అనే దానిపై ఇంకా మిస్టరీ వీడలేదు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ లోపే కొన్ని సీసీ కెమెరా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ సీసీ ఫుటేజీ వీడియోను చూస్తే.. నందిగామ నియోజకవర్గం కీసర టోల్ గేట్ కు ముందే ప్రవీణ్ కుమార్ ప్రమాదానికి గురైనట్టు కనిపిస్తోంది. బైక్ నేరుగా వెళ్లి పడిపోవడం.. ఆ తర్వాత ఆయన కిందపడడం.. దుమ్ములేవడం అంతా సీసీ ఫుటేజీ వీడియో స్పష్టంగా కనిపిస్తోంది.
సీసీ ఫుటేజీ వీడియో ఏముందంటే.. కీసర టోల్ గేట్‌కు ముందు పాస్టర్ ప్రవీణ్ బైక్ కు ప్రమాదం జరిగింది. బైక్ రోడ్డు మీద పడిపోవడంతో అక్కడ దుమ్ము పైకి లేచింది. దీంతో ఆయన పైకి లేవడానికి ఇబ్బంది పడినట్టు వీడియోలో కనిపిస్తోంది.
ఆ తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించున్న ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. గొల్లపూడిలోనూ ఆయన బైక్ ను కంట్రోల్ చేయలేకపోతున్నట్టు ఆ వీడియో కనిపిస్తుంది. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ప్రవీణ్ సిటీ వెళ్లిపోయారు. అయితే రావవరప్పాడు రింగ్ రోడ్డు సమీపంలోను ప్రవీణ్ కిందపడినట్టు పోలీసులు చెబుతున్నారు. దాదాపు మూడు గంటల పాటు రింగ్ రోడ్డు వద్ద గడిపిన ప్రవీణ్.. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు.
కీసర టోల్‌గేట్‌కు ముందే పాస్టర్ ప్రవీణ్ పగడాల బైక్‌కు ప్రమాదం
బయటికి వచ్చిన ఏలూరు దగ్గరి మద్యం దుకాణం వద్ద సీసీటీవీ ఫుటేజ్
కీసర టోల్‌గేట్‌కు ముందు అదుపుతప్పిన ప్రవీణ్ బైక్
గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించుకుని సిటీ వైపు వెళ్లిన ప్రవీణ్
రామవరప్పాడు రింగ్ రోడ్డు… https://t.co/xQC3HNtlyc pic.twitter.com/sc8etO9sdc
— BIG TV Breaking News (@bigtvtelugu) March 31, 2025
ALSO READ: Lady Aghori News: నా బిడ్డ చచ్చిపోయింది అనుకుంటా.. శ్రీవర్షణీ తండ్రి సంచలన వ్యాఖ్యలు..