Japan Nankai Trough Megaquake: జపాన్ అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ, నిత్యం భూకంపాలు, సునామీలతో సావాసం చేస్తుంటుంది. ఈ ద్వీపకల్ప దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట భూప్రకంపనలు చోటు చేసుకుంటాయి. అక్కడి ప్రజలు ఎప్పుడు ఎలాంటి ముప్పు పొంచి ఉందోననే భయంతో బతుకుతుంటారు. ఈ నేపథ్యంలో జపాన్ తాజా విపత్తు నివేదిక ప్రజలను, ప్రభుత్వాన్ని భయంలో ముంచింది. నాంకై ట్రఫ్ మెగా భూకంపం గురించి సంచలన విషయాలను వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఏకంగా 2 లక్షల 98 వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. సుమారు కోటి 23 లక్షల మంది వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ వచ్చని తేల్చిచెప్పింది. ఏకంగా 1.8 ట్రిలియన్ల ఆస్తి నష్టం కలిగించే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. అతి తీవ్రమైన ఈ భూకంపాన్ని ఎదుర్కొనేందుకు జపాన్ సిద్ధంగా లేదని తేల్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, ఈ భూకంపం ఎప్పుడు రాబోతుంది? అనే విషయాన్ని మాత్రం నివేదిక వెల్లడించలేదు.
గత ఏడాది జపాన్ లో భూకంపం
గత ఏడాది జనవరిలో జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9 గా నమోదైంది. క్యుషు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. దీని ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది. నిత్యం భూప్రకంపనలతో ప్రజలకు ప్రశాంతమైన నిద్ర కరువైంది.
జపాన్ కు భూకంపాల ముప్పు ఎందుకు?
జపాన్ ద్వీపకల్పం కావడంతో చుట్టూ సముద్ర జలాలు ఉంటాయి. సముద్రం, భూమి మధ్య ఏర్పడిన సంఘర్షణతో ఇలాంటి భూకంపాలు చోటుచేసుకుంటాయని పరిశోధకులు చెప్తున్నారు. తరచుగా భూప్రకంపనలు అనేవి కామన్ అన్నారు. అయితే, ఎప్పుడో ఒకసారి భూకంపాల తీవ్రత అధికంగా ఉంటుందని, అదే సమయంలో సునామీ ముప్పు పొంచి ఉందని చెప్తున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించి నివసించాలని సూచిస్తున్నారు. ఇక 2011లో వచ్చిన భూకంపం జపాన్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏకంగా 9.0గా రికార్డు అయ్యింది. పెద్దమొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
భూకంపాల నుంచి రక్షణ కోసం చర్యలు
ఇక జపాన్ ప్రభుత్వం భూకంపాల నుంచి రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు భూకంపాల ముందస్తు హెచ్చరికలు, సునామీ హెచ్చరికలు చేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. జపాన్ భూకంప పరిశోధన కమిటీ రాబోయే 30 సంవత్సరాలలో నాంకై ట్రఫ్ మెగా భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని తీవ్రం ఊహకు అందని రీతిలో ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో జపాన్.. దేశ ప్రజలకు భూకంపాల గురించి అవగాహన కల్పించడంతో పాటు, భూకంపాల సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై శిక్షణ ఇస్తున్నారు. ఊహకు మించి విపత్తులు సంభవిస్తే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశంపై ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు తగిన ఏర్పాటు చేసుకుంటున్నది. విపత్తు ఏ స్థాయిలో ఉన్నా ఎదుర్కొనేందుకు రెడీ ఉంటుంది.
Japan’s latest disaster report warns of a Nankai Trough megaquake that could kill 298K, displace 12.3M, and cause $1.8Trillion in damage
Despite decades of prep, experts fear the country still isn’t ready pic.twitter.com/KeemUSxSdb
— RT (@RT_com) March 31, 2025
Read Also: స్విమ్మింగ్ పూల్ పరుపుపై జంట.. ఇంతలో భూకంపం, ఒక్కసారిగా..