E-Paper
Advertisement

ఉప్పల్‌లో భారీ చోరీ.. 30 తులాల బంగారం, రూ.6 లక్షలు అపహరణ!

ఉప్పల్‌లో భారీ చోరీ.. 30 తులాల బంగారం, రూ.6 లక్షలు అపహరణ!
Advertisement

Uppal Theft: ఇంటికి తాళం వేసి కొమరవెల్లి ఆలయానికి వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ భరత్‌నగర్ కాలనీలో అర్ధరాత్రి వేళ దొంగలు విరుచుకుపడ్డారు. రూమ్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగుడు, బీరువాలో ఉన్న సుమారు 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 6 లక్షల నగదును గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లాడు.

అర్ధరాత్రి వేళ బుర్కాలో వచ్చిన దుండగుడు

Advertisement

కాలనీకి చెందిన భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు దైవదర్శనం కోసం కొమరవెల్లి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి అర్ధరాత్రి దాటాక 2 గంటల ప్రాంతంలో బుర్కా ధరించి అక్కడకు చేరుకున్నాడు. ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, నిమిషాల వ్యవధిలోనే బీరువా తెరిచి విలువైన సొత్తును దోచుకున్నాడు. సుమారు గంటపాటు ఇంట్లోనే ఉండి చోరీకి పాల్పడినట్లు తెలిసింది.

పనిమనిషి వల్ల వెలుగులోకి..

Advertisement

మరుసటి రోజు ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగిలి ఉండటం గమనించింది. వెంటనే భాస్కర్ రెడ్డి కుటుంబానికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఊరి నుంచి తిరిగొచ్చారు. లోపలికి వెళ్లి చూడగా సామగ్రంతా చిందరవందరగా పడి ఉంది. బీరువాలోని బంగారం, నగదు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు

సంఘటనా స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించారు. దొంగ తాళాలు పగలగొడుతున్న దృశ్యాలు, అతడి కదలికలు ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ల స్కీమ్‌పై మంత్రి పొన్నం కీలక అప్‌డేట్!

Tags

Related News

ప్రేమ పేరుతో మోసం.. ఖమ్మంలో ప్రియుడి ఇంటి ముందు బాధితురాలి ధర్నా!

‘అర్నబ్’ తుపాన్ ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దు!

మహిళలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ల స్కీమ్‌పై మంత్రి పొన్నం కీలక అప్‌డేట్!

విలువ లేనోడు రాజీనామా చేస్తే ఏంటి ఉపయోగం? హరీష్ రావుకు అద్దంకి మాస్ కౌంటర్!

‘కేంద్రంలో ఉండి ఏం పీకుతున్నారు’? మోడీ, అమిత్ షాలపై అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్!

అమీర్ అలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ డిమాండ్.. గాంధీభవన్ వద్ద పోస్టర్లు

హైదరాబాద్‌లో విషాదం.. దుర్గం చెరువులో దూకి వైజాగ్ టెక్కీ ఆత్మహత్య

Big Stories

Advertisement
×