BigTV English

OTT Movie : గడ్డిలో దెయ్యం, పిల్లాడికేమో భయం… క్లైమాక్స్ మాత్రం ఘోరం భయ్యా

OTT Movie : గడ్డిలో దెయ్యం, పిల్లాడికేమో భయం… క్లైమాక్స్ మాత్రం ఘోరం భయ్యా

OTT Movie : ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పే కథల్లోనే, చిన్నప్పుడు దయ్యాలు ఎలా ఉంటాయో ఊహించుకునేవాళ్లం. అయితే ఆ తర్వాత సినిమాలలో వాటి రూపాలను చూస్తున్నాం. చివరికి ఈ కథలు, సినిమాలను చూస్తూ, ప్రేక్షకులు భయపెడుతూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ మూవీ కూడా చివరి వరకు భయపెడుతూ, మరో దయ్యాల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ కెనడియన్ సూపర్‌ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఇన్ ది టాల్ గ్రాస్’ (In the Tall Grass). 2019 లో వచ్చిన ఈ మూవీకి విన్సెంజో నటాలి దర్శకత్వం వహించారు. ఇది స్టీఫెన్ కింగ్, జో హిల్ 2012 లో రచించిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో హారిసన్ గిల్బర్ట్‌సన్, లైస్లా డి ఒలివేరా, అవరీ విట్టెడ్, విల్ బ్యూ జూనియర్, రాచెల్ విల్సన్, పాట్రిక్ విల్సన్ నటించారు. ఈ సినిమా కథ ఒక వింతైన పొలంలోని, ఎత్తైన గడ్డిలో చిక్కుకున్న వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

బెకీ అనే గర్భిణీ స్త్రీ, ఆమె సోదరుడు కాల్ తో కారులో ప్రయాణిస్తుంటుంది. ఒక రోడ్డు పక్కన ఉన్న ఎత్తైన గడ్డి పొలం నుండి, ఒక చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వీళ్ళకు వినిపిస్తుంది. ఆ పిల్లాడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో బెకీ, కాల్ గడ్డిలోకి ప్రవేశిస్తారు. కానీ వారు లోపలికి వెళ్లిన తర్వాత, ఆ పొలం సాధారణమైనది కాదని తెలుస్తుంది. అది ఒక అతీంద్రియ శక్తితో కూడిన ప్రదేశం అని తెలీసుకుంటారు. ఇక్కడ సమయంలో కూడా వ్యత్యాసం ఉంటుంది. గడ్డిలోకి వెళ్ళాక వీళ్ళిద్దరూ దారి తప్పుతారు. ఎంత వెతికినా ఒకరినొకరు కనిపెట్టలేకపోతారు. ఎందుకంటే ఆ ప్రదేశం వారిని వేరు చేస్తూ, దారి తప్పిస్తూ ఉంటుంది. ఆ తరువాత బెకీ బాయ్‌ఫ్రెండ్ ట్రావిస్ అక్కడికి వస్తాడు. అతను బెకీని వెతకడానికి గడ్డిలోకి వెళతాడు. అక్కడ వాళ్ళు ఒక పురాతన నల్ల రాయిని కనుగొంటారు. ఇది అక్కడ జరుగుతున్న, భయంకర సంఘటనలకు కేంద్ర బిందువుగా ఉంటుంది.

ఈ రాయి ఒక దుష్ట శక్తిని కలిగి ఉంటుంది. ఆ ప్రాంతంలో చిక్కుకున్న వారిని మానసికంగా, శారీరకంగా ఆ దుష్ట శక్తి పీడిస్తుంది. సినిమా ముందుకు వెళ్ళే కొద్దీ, టైమ్ లూప్‌లు, భయంకరమైన రహస్యాలు వెల్లడవుతాయి. అక్కడ ఒకరినొకరు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ గడ్డి, రాయికి ఉన్న శక్తి వారిని విడదీస్తాయి.ట్రావిస్ తన ప్రాణాలకు తెగించి పోరాడి బెకీ, కాల్‌ను బయటకు పంపేందుకు ఒక మార్గం కనిపెడతాడు. ఇంతలోనే అతను ఆ గడ్డిలో చిక్కుకుపోతాడు.చివరికి ఆ ప్రాంతం నుంచి వీళ్ళంతా బయట పడతారా ? ఆ గడ్డి రహస్యం ఏమిటి ? అందులో ఉన్న దుష్ట శక్తి ఎవరు ? ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×