Pawan Kalyan Comments on Jagan Govt Land Act: వైసీపీకి ఓటు వేస్తే మన ఆస్తులు గాల్లో పెట్టిన దీపమేనన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌గా వర్ణించారు. ఇది ముమ్మాటికీ భూములను దోచే చట్టమన్నారు. ఓన్లీ జెరాక్స్ పేపర్ ఇస్తున్నారని ఆరోపించారు. మోదీ లాంటి బలమైన నాయకులే రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన భూ చట్టాన్ని తాము అమలు చేస్తున్నామని పదేపదే వైసీపీ నేతలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు పవన్‌కల్యాణ్. కేంద్రం ముసాయిదాను రాష్ట్రాలకు మాత్రమే పంపిందని, దానిపై అభిప్రాయాలు తీసుకుంటోందన్నారు. కొత్త చట్టం ప్రకారం మన ఆస్తి రెవెన్యూ ఆఫీసు వద్ద ఉంటుందన్నారు. 90 రోజుల్లో నిరూపించుకోకపోతే మన ఆస్తి గోవిందాని అన్నారు. ఈ చట్టం ప్రకారం కోర్టులు, పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి వీల్లేదన్నారు. రెవెన్యూ ఆఫీసులో సెటిల్ చేస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎందుకుందని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఏనాడైనా ఈ చట్టం గురించి చర్చించారా అని వైసీపీ సర్కార్‌ని నిలదీశారు. ఐదేళ్ల జగన్ ప్రభుత్వంపై జరిగిన అరాచకాలను వివరించారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ గురించి పదే పదే ప్రస్తావించారు. యువతను గంజాయికి బానిస చేస్తున్నారని గుర్తు చేశారు. యువత మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిర్ణయం మీదేనని, ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం మొదట నోరు ఎత్తింది జనసేన అని, ప్రత్యేకంగా కార్పొరేషన్ చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: ఫ్యామిలీలో రాజకీయ చిచ్చు.. ముద్రగడకు కూతురు ఝలక్
పనిలోపనిగా అటవీశాఖ మంత్రి పెద్దరెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు పవన్ కల్యాణ్. మంత్రి ఏనాడైనా వచ్చి కొల్లేరును పరిశీలించారా? అని ప్రశ్నించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా ఎందుకు అభివృద్ధి చేయడం లేదన్నారు. ఎర్రచందనం విషయంలో బిజీగా ఉన్నారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌పై ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తగ్గేదిలేదని మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై పవన్ తనదైనశైలిలో కౌంటరిచ్చారు. కైకలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.