BigTV English

Okaya Ferrato Disruptor EV Price: స్పోర్టీ లుక్‌తో మార్కెట్‌లోకి మరో కొత్త బైక్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే

Okaya Ferrato Disruptor EV Price: స్పోర్టీ లుక్‌తో మార్కెట్‌లోకి మరో కొత్త బైక్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే

Get Sports Look Okaya Ferrato Disruptor EV at Rs 1.59 Lakhs Only: ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ బైక్‌లకు మంచి డిమాండ్ ఉంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ బైక్‌లకు ఆదరణ పెరుగుతుంది. దీంతో మార్కెట్‌లోకి కొత్త కొత్త మోడళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు సైతం రకరకాల వేరియంట్లను లాంచ్ చేసి బైక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరొక బ్రాండెడ్ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది.


ప్రముఖ బ్యాటరీ, యుపిఎస్ తయారీ కంపెనీ ఒకాయ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఫెర్రాటో డిస్‌రప్టర్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ బైక్‌ స్పోర్టీ లుక్‌లో వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. భారతీయ మార్కెట్లో దీని ధర రూ.1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. లాంచ్ సందర్భంగా… ఫెర్రాటో డిస్‌రప్టర్ బైక్ డెలివరీ ఆగస్టు 2024 నుండి ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ బైక్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది.

ఒకాయ EV ఫెర్రాటో డిస్‌రప్టర్‌ అద్భుతమైన స్పోర్టీ లుక్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది టెలిస్కోపిక్ ఫోర్క్, మోనో షాక్ సస్పెన్షన్ కలిగి ఉంది. అంతేకాకుండా ఇది కాంబి బ్రేక్ సిస్టమ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, 16 లీటర్ల ఆన్ బోర్డ్ స్టోరేజ్ స్పేస్‌ను కూడా కలిగి ఉంది. దీనితో పాటు ఈ ఎలక్ట్రిక్ బైక్ 3.3 kW మోటార్‌ను కలిగి ఉంది. దాని గరిష్ట ఉత్పత్తి 6.37 kW. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో మొబైల్, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.


Also Read: డుకాటి నుంచి స్పోర్టీ బైక్.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు

దీనితో పాటు జియో ఫెన్సింగ్, ఫైండ్ మై స్కూటర్ అనే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా బైక్ దొంగిలించబడ్డా లేదా ఎవరైనా పట్టుకెళ్లినా ఎక్కడుందో ఈజీగా కనుక్కోవచ్చు. ఈ బైక్ ఎకో, సిటీ, స్పోర్ట్ వంటి మూడు మోడ్‌లలో వస్తుంది. ఈ బైక్ 3.97 kWh LFP(Lithium iron phosphate) బ్యాటరీని కలిగి ఉంది. 129 Km/Charge పరిధిని కలిగి ఉంది. దీనితో ఈ బైక్ 228Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీని గరిష్ట వేగం గంటకు 95 కి.మీ. ఈ బైక్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది.

సౌండ్ అంటే ఇష్టం ఉన్న వారికి సౌండ్ బాక్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు. కానీ ఇది విడిగా అందుబాటులో ఉంది. దీని కోసం సుమారు రూ.10,000 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ బైక్ మిడ్‌నైట్ షైన్, థండర్ బ్లూ, ఇన్ఫెర్నో రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×