BigTV English

Chandrababu Oath Taking: “చంద్రబాబు నాయుడు అనే నేను..” హోరెత్తిన సభా ప్రాంగణం..

Chandrababu Oath Taking: “చంద్రబాబు నాయుడు అనే నేను..” హోరెత్తిన సభా ప్రాంగణం..

Chandrababu Naidu Oath Taking: ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. నారా చంద్రబాబు నాయుడితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు నాయుడు అనే నేను.. అని అనగానే సభా ప్రాంగణం హోరెత్తిపోయింది.


శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగంపట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో..నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, నాకు తెలియవచ్చిన కర్తవ్యాలను నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ఆ విషయాలను ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు.

ప్రమాణ స్వీకారానికి ముందు.. పోలీస్ యంత్రాంగమంతా జనగణమన గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, నందమూరి ఫ్యామిలీ, సూపర్ స్టార్ రజనీకాంత్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


Also Read: Nara Lokesh : పవన్ కాళ్లు మొక్కిన నారా లోకేష్.. నెట్టింట వీడియో వైరల్

ప్రమాణ స్వీకారానికి ముందు.. పోలీస్ యంత్రాంగమంతా జనగణమన గీతాన్ని ఆలపించారు.

చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం.. పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో..నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, నాకు తెలియవచ్చిన కర్తవ్యాలను నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ఆ విషయాలను ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. అనంతరం తన అన్న, మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు.

Also Read: CM Chandrababu: జగన్ బొమ్మ ఉన్నా పర్లేదు.. కిట్లు పంపిణీ చేయండి : సీఎం చంద్రబాబు

అనంతరం.. నారా లోకేష్ సహా.. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, మొహమ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్. సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం మరోసారి పోలీస్ యంత్రాంగం జాతీయ గీతం మ్యూజిక్ ప్లే చేయగా.. ప్రధాని నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు తమలోతాము జాతీయ గీతాన్ని ఆలపించారు.

Related News

YS Jagan: జగన్ మద్దతు కోరిన బీజేపీ.. కాదని చెప్పే ధైర్యం ఆయనకు ఉందా?

Nara Lokesh: నలుగురు కేంద్ర మంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఏపీకి ఏయే వరాలు అడిగారంటే?

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్

Kuna Ravi Kumar: KGVB ప్రిన్సిపల్‌ ఆరోపణలపై ఎమ్మెల్యే కూన రవి రియాక్ట్..

Adarana 3 Scheme: ఆదరణ 3.0 స్కీమ్.. లబ్దిదారులకు టూ వీలర్స్, ఇక పండగే

Weather Report: ఏపీకి రానున్న మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Big Stories

×