E-Paper
Advertisement

Jana Sena: ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. సరికొత్త సిద్ధాంతంతో పవన్ అడుగులు..!

Jana Sena: ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. సరికొత్త సిద్ధాంతంతో పవన్ అడుగులు..!
Advertisement

Jana Sena: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం లాంటి సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న జనసేన పార్టీ జాతీయ సమగ్రత దృక్పథంతో ” సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం అనే శీర్షికతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది.

జనసేన ప్రస్థానం..

జనసేన పార్టీ స్థాపించి పుష్కర కాలమైంది. ఈ కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, జాతీయ సమైక్యతపై జనసేన ఎటువంటి భావజాలంతో పని చేస్తుందో పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో వివరించనున్నారు. జాతీయతకు కేంద్ర బిందువైన దేశ రాజధానిలో ఈ సమావేశం ఏర్పాటైంది. జనసేన తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీ లో చేరిన సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

Advertisement

Also read: ప్రతిభావంతులైన విద్యార్థులకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సత్కారం..

పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

ప్రాంతీయతకు విలువ ఇస్తూనే జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా నిలబడాలి. వర్తమాన పరిస్థితుల్లో సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకతతోపాటు జాతీయ రాజకీయాలపై నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను పార్టీ నేతలు ఢిల్లీలో పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో అశోక హోటల్లో ఈ సమావేశం మొదలై సాయంత్రం ముగుయనుంది.

Advertisement

Also Read: గూగుల్‌లో పొరపాటున కూడా ఈ 5 విషయాలను వెతకకండి.. ఎందుకో తెలుసా?

Related News

ఏఐ వీడియో కలకలం.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై బొత్స హాట్ కామెంట్స్.. చంద్రబాబుకు నేరుగా సవాల్!

లోకేష్‌ చెంప పగలగొట్టాలి.. భువనేశ్వరిపై లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్స్!

గోదావరి ఉగ్రరూపం.. చీమలపాడు ఇసుకర్యాంపులో చిక్కుకున్న 38 మంది, రంగంలోకి అధికారులు

రూటు మార్చిన విజయసాయిరెడ్డి.. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు, అసలు వీక్‌నెస్ అదే

ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా ఇదే.. లక్షల్లో ఓట్ల గల్లంతు, మీ పేరు లేకపోతే?

‘తుడిచేవాడు కూడా ఓనర్ అయ్యాడు’.. ప్రైవేట్ ట్రావెల్స్‌పై జేసీ హాట్ కామెంట్స్!

యువతిని చంపి సూట్‌కేసులో కుక్కేసి.. ఒడిషాలో పడేశాడు ప్రియుడు, విశాఖలో దారుణమైన ఘటన

Big Stories

Advertisement
×