E-Paper
Advertisement

రెండేళ్ల సీక్రెట్ ప్రాజెక్ట్.. స్మార్ట్‌ఫోన్ల హిస్టరీలోనే మొదటిసారి వివో నుంచి అలాంటి సూపర్ చిప్!

రెండేళ్ల సీక్రెట్ ప్రాజెక్ట్.. స్మార్ట్‌ఫోన్ల హిస్టరీలోనే మొదటిసారి వివో నుంచి అలాంటి సూపర్ చిప్!
Advertisement

Vivo X Fold 6: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం వివో సరికొత్త సంచలనానికి తెరలేపింది. తమ అప్‌కమింగ్ ఫోల్డబుల్ ఫోన్ Vivo X Fold 6కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో వాడబోయే ప్రాసెసర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనిలో మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌కు చెందిన ప్రత్యేక వెర్షన్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు. కేవలం దీని కోసమే మీడియాటెక్‌తో కలిసి వివో రెండేళ్లుగా పనిచేస్తుండటం విశేషం.

పవర్‌ఫుల్ ఏఐ పర్ఫార్మెన్స్:

ఇది సాధారణంగా క్లాక్ స్పీడ్ పెంచిన చిప్ కాదని, ఫోల్డబుల్ ఫోన్ అవసరాలకు తగ్గట్టుగా రీడిజైన్ చేసిన ప్రాసెసర్ అని వివో స్పష్టం చేసింది. గత మోడల్‌తో పోలిస్తే.. ఇది 111 శాతం మెరుగైన ఎన్‌పీయూ (NPU) పనితీరును అందిస్తుంది. అదే సమయంలో బ్యాటరీ వినియోగాన్ని 56 శాతం వరకు తగ్గిస్తుంది. దీనివల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోకుండా, ఆన్-డివైస్ ఏఐ ఫీచర్లు మరింత వేగంగా, స్మార్ట్‌గా పనిచేస్తాయి.

Advertisement

Also Read: కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటల ప్లేబ్యాక్.. Lenovo Yoga Earbuds ప్రత్యేకతలు ఇవే!

వేగవంతమైన పనితీరు:

Advertisement

ఈ కొత్త చిప్‌సెట్ వల్ల వివో ఏఐ మీటింగ్ అసిస్టెంట్‌లో ఆఫ్‌లైన్ స్పీచ్ ట్రాన్స్‌క్రిప్షన్ మునుపటి కంటే ఏడు రెట్లు వేగంగా, మరింత ఖచ్చితంగా మారుతుంది. అలాగే ఫైల్ మేనేజర్‌లోని ఏఐ టెక్ట్స్ సమ్మరైజేషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫీచర్లు 20 శాతం వరకు వేగంగా రెస్పాండ్ అవుతాయి. అంటే ఆఫీస్ పనులను, డాక్యుమెంట్లను ఈ ఫోన్ ద్వారా చాలా సులభంగా మేనేజ్ చేసుకోవచ్చన్నమాట.

అద్భుతమైన మల్టీటాస్కింగ్:

ఈ ఫోన్‌తో వచ్చే ‘అటామిక్ వర్క్‌బెంచ్’ ఫీచర్ ద్వారా పెద్ద స్క్రీన్‌పై ఒకేసారి నాలుగు యాప్‌లను పక్కపక్కనే వాడుకోవచ్చు. దీనిని ‘పారలల్ మోడ్’ అని పిలుస్తారు. సాధారణ స్ప్లిట్ స్క్రీన్ లాగా కాకుండా, దీనిలో నాలుగు యాప్స్ ఒకేసారి యాక్టివ్‌గా ఉంటాయి. షాపింగ్ చేసేటప్పుడు వేర్వేరు యాప్స్‌లో ధరలను పోల్చడానికి లేదా ప్రయాణాల్లో మ్యాప్స్, మ్యూజిక్, వెబ్‌సైట్లను ఒకేసారి చూసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

భారీ బ్యాటరీ, కెమెరా ఫీచర్లు:

లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీతో రానుంది. సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుందనే వెలితిని ఇది తీర్చనుంది. దీంతో పాటు 200MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. శాంసంగ్ వంటి బ్రాండ్లకు గట్టి పోటీనిస్తూ, భారీ బ్యాటరీ, సూపర్ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచర్లతో రాబోతున్న Vivo X Fold 6 కోసం ఖచ్చితంగా వెయిట్ చేయవచ్చు.

Also Read: వాట్సప్ యూజర్స్‌కు అలర్ట్.. ఫార్వర్డ్ మెసేజ్‌లపై ఈ లేబుల్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!

Related News

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్‌లోనే లైవ్ టీవీ!

డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

Big Stories

Advertisement
×