E-Paper
Advertisement

గూగుల్‌లో పొరపాటున కూడా ఈ 5 విషయాలను వెతకకండి.. ఎందుకో తెలుసా?

గూగుల్‌లో పొరపాటున కూడా ఈ 5 విషయాలను వెతకకండి.. ఎందుకో తెలుసా?
Advertisement

Google: సాధారణంగా ఏ విషయంలోనైనా మనకు ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్ ఓపెన్ చేసి వెతికేస్తుంటాం. చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరికీ గూగుల్ ఒక అలవాటుగా మారిపోయింది. సమాచారం, అడ్రస్‌లు, వస్తువుల వివరాలు.. ఇలా ఏవైనా క్షణాల్లో మన కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. అయితే, గూగుల్ ఎంత ఉపయోగకరమో, అంతకంటే ఎక్కువ ప్రమాదకరం కూడా. కొన్ని విషయాలను గూగుల్‌లో వెతకడం వల్ల సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది. మన వ్యక్తిగత వివరాలు, డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలంటే కొన్నిటిని గూగుల్‌లో అస్సలు సెర్చ్ చేయకూడదు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. కస్టమర్ కేర్ నెంబర్ల కోసం వెతకడం:

మనకు బ్యాంక్ అకౌంట్ సమస్యలు వచ్చినప్పుడు లేదా ఏదైనా కంపెనీ ప్రొడక్ట్ గురించి సాయం కావాలన్నప్పుడు గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ల కోసం వెతుకుతుంటాం. కానీ సైబర్ నేరగాళ్లు బ్యాంకులకు, కంపెనీలకు సంబంధించిన నకిలీ నెంబర్లను గూగుల్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. పొరపాటున వాటికి ఫోన్ చేస్తే, వాళ్లు మాట్లాడే మాటలు నమ్మి మనం డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పుడైనా సరే బ్యాంక్ పాస్‌బుక్ వెనుక ఉండే నెంబర్లను లేదా అధికారిక యాప్స్, వెబ్‌సైట్లలోని నెంబర్లను మాత్రమే సంప్రదించాలి.

2. ఉచిత సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్‌లు:

Advertisement

ఇంటర్నెట్‌లో చాలామంది ఉచితంగా లభించే సాఫ్ట్‌వేర్‌లు, గేమ్‌లు లేదా సినిమాల కోసం వెతుకుతుంటారు. ‘ఫ్రీ ప్రీమియం సాఫ్ట్‌వేర్’ లేదా ‘క్రాక్డ్ వెర్షన్’ అని గూగుల్ చేయడమే మనం చేసే పెద్ద తప్పు. ఇలాంటి లింకుల వెనుక హ్యాకర్లు పొంచి ఉంటారు. ఉచితంగా వస్తుందని మనం డౌన్‌లోడ్ చేసే ఫైళ్లతో పాటు వైరస్‌లు, మాల్వేర్‌లు మన ఫోన్‌లలోకి లేదా కంప్యూటర్లలోకి చేరిపోతాయి. ఇవి మన డివైజ్‌లను పాడు చేయడమే కాకుండా, మనకు తెలియకుండానే మన డేటాను దొంగిలిస్తాయి.

Also Read: ఈ వానలకు వేడి వేడి డీప్ ఫ్రై స్నాక్స్ తినాలనిపిస్తుందా? అయితే ఈ Air Fryers మీ కిచెన్‌లో ఉండాల్సిందే!

3. ఆరోగ్య సమస్యలకు మందులు వెతకడం:

Advertisement

కొద్దిగా తలనొప్పి లేదా కడుపునొప్పి రాగానే చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలుపెడతారు. అక్కడ వచ్చే సమాచారం చూసి లేనిపోని టెన్షన్ పడుతుంటారు. చిన్న వాటికి గూగుల్ ఏదో పెద్ద జబ్బుగా చూపిస్తుంది. అది చూసి భయపడిపోవడం లేదా సొంతంగా మందులు వాడటం చాలా ప్రమాదకరం. ఇంటర్నెట్‌లో ఉండే సమాచారం అంతా నిజం కాదు. కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు గూగుల్ తల్లిని కాకుండా, నిజమైన డాక్టర్‌ని సంప్రదించడమే ఎల్లప్పుడూ సురక్షితం.

4. త్వరగా డబ్బులు సంపాదించే మార్గాలు:

తక్కువ రోజుల్లో డబ్బులు డబుల్ అవ్వడం లేదా గ్యారెంటీ లాభాలు ఇచ్చే షేర్ మార్కెట్ టిప్స్ వంటి వాటి కోసం గూగుల్‌లో వెతికితే ఖచ్చితంగా మోసపోతాం. ఇలాంటి సెర్చ్ రిజల్ట్స్ మనల్ని నకిలీ పెట్టుబడి వెబ్‌సైట్లకు, క్రిప్టో స్కామ్‌లకు తీసుకువెళ్తాయి. వారు చెప్పే మాయమాటలు నమ్మి చాలామంది తమ జీవితకాల సంపాదనను ఒక్క రోజులోనే పోగొట్టుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో ఎప్పుడూ నమ్మకమైన, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల సలహాలు మాత్రమే తీసుకోవాలి.

5. సొంత వివరాల గురించి వెతకడం:

చాలామంది సరదాగానో లేదా కుతూహలంతోనో తమ సొంత ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ లేదా ఆధార్ వివరాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం ఇంటర్నెట్‌లో ఏయే నకిలీ సైట్లలో ఉందో హ్యాకర్లకు సులభంగా తెలిసిపోతుంది. ఒకవేళ పొరపాటున మీ వివరాలు ఎక్కడైనా కనిపిస్తే.. ఆ పేజీలను క్లిక్ చేయకుండా, వాటిని ఇంటర్నెట్ నుండి తొలగించడానికి ప్రయత్నించాలి. ఎప్పుడూ ఇంటర్నెట్ వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా, వివేకంతో వ్యవహరిస్తే మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవచ్చు.

Also Read: వాట్సప్ యూజర్స్‌కు అలర్ట్.. ఫార్వర్డ్ మెసేజ్‌లపై ఈ లేబుల్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!

Tags

Related News

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్‌లోనే లైవ్ టీవీ!

డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

Big Stories

Advertisement
×