Pawan Kalyan: గేమ్ ఛేంజర్ జర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చకు దారితీసింది. రాజమండ్రిలో జరుగుతున్న గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య ఈనెల 10న విడుదల కానున్న సందర్భంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ రంగాన్ని హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ స్థాయి అంటూ హీరోల స్థాయిని వేర్వేరుగా ప్రచారం సాగించడం తగదన్నారు. సినిమా రంగమనేది కళాకారులకు పుట్టినిల్లుగా వర్ణించిన పవన్ కళ్యాణ్, వేర్వేరు స్థాయిలో నటులను కీర్తించడం తగదన్నారు. 1990 వరకు కేవలం సినిమాను సినిమాగా చూసే వారని, ఆ తర్వాత హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లు తెరపైకి వచ్చాయన్నారు.
ఇదే విషయంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరో కీలక కామెంట్ చేశారు. సినిమా రంగం అనేది అంతా ఒకటేనన్న కనిపించాలని, దేశం మొత్తం ఒకటే సినిమా రంగమనే భావన ఉండాలన్నారు. పవన్ కామెంట్స్ ను బట్టి, వన్ నేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ వన్ నేషన్ వన్ కార్డ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది.
తాజాగా పవన్ కూడ వన్ నేషన్ వన్ సినిమా వన్ వుడ్ అనే తరహాలో యావత్ సినిమా ప్రపంచాన్ని ఏకం చేసేలా మాట్లాడారు. ఇటీవల పలువురు హీరోలు నటించిన సినిమాలను హాలీవుడ్ రేంజ్, బాలీవుడ్ రేంజ్ అంటూ అభిమానులు ప్రచారం సాగించిన పరిస్థితి మనకు తెలిసిందే. ఇటువంటి ప్రచారంతో సినిమా రంగానికి కాస్త తలనొప్పులు అధికమవుతాయన్న తన అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యక్తం చేశారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఏ దృష్టితో చేశారో కానీ, ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.