BigTV English

Game Changer: మూవీకి కొత్త చిక్కులు.. సంక్రాంతి బరి నుండి తప్పుకోనుందా..?

Game Changer: మూవీకి కొత్త చిక్కులు.. సంక్రాంతి బరి నుండి తప్పుకోనుందా..?

Game Changer:ప్రముఖ డైరెక్టర్ ఎస్.శంకర్ (S.Shankar)దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). ఎన్నో అంచనాల మధ్య జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dilraju ) భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో కియారా అద్వానీ (Kiara Advani), అంజలి(Anjali )హీరోయిన్లుగా నటిస్తుండగా, ఎస్.జె. సూర్య(S.J.Surya ), శ్రీకాంత్(Srikanth )తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కూడా హాజరయ్యారు.


శంకర్ వర్సెస్ లైకా ప్రొడక్షన్..

అయితే సినిమా విడుదల తేదీకి అన్ని ఆర్భాటాలు జరుగుతున్న నేపథ్యంలో సడన్గా అభిమానులకు షాక్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా సంక్రాంతి బరి నుండి అక్కడ తప్పుకోబోతోందనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు తమిళనాడులో కొత్త చిక్కు ఏర్పడిందని తెలుస్తోంది. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు లైకా ప్రొడక్షన్ సంస్థ అడ్డంకిగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే శంకర్ దర్శకత్వంలో చివరిగా వచ్చిన చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమా ఘోర పరాభవాన్ని చవిచూసింది. అంతేకాదు ఈ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వారికి భారీగా నష్టాలు కూడా వచ్చాయి. ఇక భారతీయుడు 2 సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దాని మూడవ భాగాన్ని కూడా శంకర్ పూర్తి చేశారు. ప్రస్తుతం అందులో ఒక పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. దీనికి తోడు ఇండియన్ 2 ఫలితాన్ని చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించాలని శంకర్ నిర్ణయించుకున్నారట. దానికి సుమారుగా రూ.80 కోట్ల వరకు ఖర్చవుతుందని అడిగారట శంకర్. అందులో రూ.30 కోట్ల వరకు ఆయన రెమ్యూనరేషన్ కూడా ఉంటుందని సమాచారం.


తమిళనాడులో గేమ్ ఛేంజర్ కి తప్పని తిప్పలు..

అయితే దీనికి లైకా సంస్థ వారు అంగీకరించనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇండియన్ 2 సినిమా ఇప్పటికే ఘోరపరాభవం చవిచూసింది. దీనికి తోడు లైకా సంస్థకు భారీగా నష్టం మిగలడంతో శంకర్ రెమ్యునరేషన్ కాకుండా నిర్మాణ ఖర్చులు మాత్రమే ఇస్తామని చెప్పారట. దీంతోపాటు ఇప్పటివరకు తీసిన ‘భారతీయుడు 3’ సినిమాని విడుదల చేయమని కూడా అడిగారట. కానీ దానికి శంకర్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే లైకా సంస్థ సినీ కౌన్సిల్లో ‘గేమ్ ఛేంజర్’ సినిమాని తమిళనాడులో విడుదల చేయకుండా నిషేధించాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ‘ఇండియన్ 3’ సినిమాని పూర్తి చేసి ఇవ్వడానికి శంకర్ ఒప్పుకోకపోతే ఆ సినిమాని తమిళనాడులో విడుదల చేయకూడదని కూడా చెప్పారట. అయితే దీంతో భయపడిపోయిన గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు (Dilraju)ఇద్దరి మధ్య వ్యక్తిగత సమస్యల వల్ల నేను నిర్మించిన సినిమాను నిషేధించమని చెప్పడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరించారట. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా తమిళనాడులో పొంగల్ కు విడుదల అవుతుందా? లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.? మరి రంగంలోకి దిగిన దిల్ రాజు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×