BigTV English

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ రాకూడదంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే !

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ రాకూడదంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే !

Breast Cancer: 20 ఏళ్లు పైబడిన మహిళలు తప్పకుండా ఆరోగ్యం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. 20 ఏళ్లు పైబడిన మహిళలందరూ క్రమం తప్పకుండా తమ బ్రెస్ట్ స్వయంగా పరీక్షించుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


వైద్య రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల కారణంగా, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్స మునుపటి కంటే సులభతరం అయింది. అయితే ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. క్యాన్సర్ అనేది జన్యుపరమైన, బాహ్య కారకాల కలయిక వల్ల వచ్చే వ్యాధి అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు క్యాన్సర్‌ను నిరోధించడానికి సలహాలు సూచలను ఇస్తున్నారు.

క్యాన్సర్ పురుషులు, స్త్రీలను వేర్వేరుగా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషులకు ప్రోస్టేట్, పెద్దప్రేగు, ఊపిరితిత్తులు , చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే స్త్రీలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.


మహిళల్లో క్యాన్సర్ ప్రమాదం:
మహిళల్లో క్యాన్సర్ యొక్క ప్రపంచ గణాంకాలను పరిశీలిస్తే.. అత్యధిక సంఖ్యలో రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నప్పటికీ.. జీవనశైలి, ఇతరత్రా అనేక కారణాల వల్ల 20 ఏళ్ల వయసులో కూడా బాలికలు బాధితులుగా మారుతున్నారు. కాబట్టి, చిన్నప్పటి నుండే రొమ్ము క్యాన్సర్ ప్రమాద కారకాల గురించి మహిళలందరూ జాగ్రత్తగా ఉండాలి.

రొమ్ము క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి ?
20 ఏళ్లు పైబడిన మహిళలందరూ క్రమం తప్పకుండా బ్రెస్ స్వయంగా పరీక్షించుకోవాలి. మీరు మీ బ్రెస్ట్ ఆకృతిలో ఏదైనా మార్పును గమనించినట్లయితే లేదా తాకినప్పుడు ఏదైనా గడ్డలా అనిపిస్తే, మీరు అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ విషయంలో ఈ రెండు లక్షణాలను ప్రారంభంలోనే ఎదుర్కుంటారు. ఈ రకమైన సమస్య కొంతకాలం కొనసాగితే, వీలైనంత త్వరగా మీరు డాక్టర్లను సంప్రదించండి.

మీరు మీ బ్రెస్ట్ నిరంతరం నొప్పిని అనుభవిస్తున్నారా? చనుమొనలలో ఎరుపు, కుంచించుకుపోవడం లేదా ఏదైనా అసాధారణ మార్పును మీరు గమనించారా? అవును అయితే, ఇవి రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు కావచ్చు. వీటిని అజాగ్రత్త చేయకూడదు. రొమ్ము క్యాన్సర్ యొక్క కొన్ని సందర్భాల్లో, చనుమొన నుండి బ్లడ్ డిశ్చార్జ్ కూడా అవుతుంది. ఇలాంటి సమస్య మీరు ఎదర్కుంటున్నట్లయితే తప్పకుండా డాక్టర్లను సంప్రదించాలి.

Also Read: ఇలా చేస్తే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?
బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి, మీ బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. ఊబకాయం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి నియంత్రణలో ఉంచడానికి చర్యలు తీసుకోండి.

శారీరక శ్రమ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని 10% తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

వివిధ రకాల పండ్లు , కూరగాయలు తినండి. వీటిలో క్యాన్సర్‌ను నిరోధించే యాంటీక్యాన్సర్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×