E-Paper
Advertisement

SC On YS Jagan: జగన్ కేసు కదలిక, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

SC On YS Jagan: జగన్ కేసు కదలిక, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
Advertisement

SC on YS Jagan: వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక మొదలైంది. ఇన్నాళ్లు సైలెంట్ అయిన ఈ కేసులపై సుప్రీంకోర్టు ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో కేసులకు సంబంధించి పూర్తి వివరాలు రెండు వారాల్లో ఇవ్వాలని పేర్కొంది. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చెయ్యాలంటూ రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది.

Advertisement

ఆర్గ్యుమెంట్ సందర్భంగా రోజువారీ పద్దతిలో విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయని న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక ప్రశ్నలు సంధించారు.

విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. డిశ్చార్జ్, వాయిదా పిటిషన్ల నేపథ్యంలో ఆలస్యమవుతోందని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలిస్తామని ధర్మాసనం పేర్కొంది.

Advertisement

ALSO READ: ఆట విడుపు కోసం.. ఆహా ఏమి రుచి అంటూ మంత్రి అనిత

ఈ క్రమంలో అక్రమాస్తుల కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని సీబీఐ, ఈడీని ఆదేశించింది. అంతేకాదు కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు, సీబీఐ, ఈడీ కేసుల వివరాలు చార్జ్ రూపంలో ఇవ్వాలని అందులో ప్రస్తావించింది. తదుపరి విచారణ జనవరి 13 కు వాయిదా వేసింది ద్విసభ్య ధర్మాసనం.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×