E-Paper
Advertisement

అస్సాం ప్రజలకు అండగా ఏపీ.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!

అస్సాం ప్రజలకు అండగా ఏపీ.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!
Advertisement

Pawan Kalyan: అస్సాంలో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుతో అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు తనను తీవ్రంగా కలిచివేసినట్లు వాపోయారు. అకస్మిక వరదల వల్ల భారీగా ప్రాణ నష్టం జరిగిందని.. వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధ ఎంతో వర్ణనాతీతమని ఎక్స్ లో రాసుకొచ్చారు.

ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఈ సందర్భంగా పవన్ సంఘీభావం తెలిపారు. ఈ కష్టకాలంలో అస్సాంలోని సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ తరపున కూడా సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని అస్సాం ప్రజలకు సూచించారు.

Advertisement

మరోవైపు అస్సాం ప్రజలకు అందుతున్న సహాయక చర్యల పట్ల పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన ఆహారం, వైద్యం, తదితర పునరావాస చర్యలను ప్రభుత్వం మరింత వేగంగా అందిస్తుందని ఆశిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. అటు సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది సైతం సురక్షితంగా ఉండాలని పవన్ సూచించారు. మరోవైపు ఈ విపత్తును తట్టుకునే ధైర్యాన్ని అస్సాం ప్రజలకు ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Advertisement

Also Read: ప్రధాన్ రాజీనామా చేయకున్నా దీక్ష విరమణ ఎందుకు? సోనమ్ వాంగ్‌చుక్ ఆన్సర్ ఇదే!

ఇదిలా ఉంటే అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జనవాసాలను వరద నీరు ముంచెత్తడంతో ఇప్పటివరకూ 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 56,606.777 హెక్టార్ల పంట నీట మునగడంతో వ్యవసాయం రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ వరదలకు 12 జిల్లాల్లోని 7 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అస్సాం వ్యాప్తంగా 363 సహాయక శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా అందులో 1,15,205 మంది ఆశ్రయం పొందుతున్నట్లు ప్రకటించింది.

Also Read: 15 ఏళ్ల వైభవ్ పై అతిగా ఆశలు పెట్టుకోవద్దు…శ్రీలంక మాజీ బౌలర్ వార్నింగ్

Related News

జాబ్స్ అడిగితే కేసులా బాబు? ఇదేం దారుణం: జగన్ ఫైర్

బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను

ఏపీకి భారీ వర్ష గండం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిపై పోస్టులా.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్!

మెగా డీఎస్సీ కాదు.. అది దగా డీఎస్సీ.. కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్!

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మ‌రో ప‌ద‌వి.. ఈసారి కూతురు సుస్మిత‌ వంతు, దుర్గగుడి బోర్డులో ప్రత్యేక పదవి

పార్టీ కేడర్‌కు టీడీపీ-జనసేన పార్టీలు వార్నింగ్.. రిపీట్ చేస్తే ఊరుకునేది లేదు

Big Stories

Advertisement
×