BigTV English

Pawan Kalyan Speech: హిందూధర్మం జోలికి వస్తే.. జగన్‌కు జనసేనాని స్ట్రాంగ్ వార్నింగ్..

Pawan Kalyan Speech: హిందూధర్మం జోలికి వస్తే.. జగన్‌కు జనసేనాని స్ట్రాంగ్ వార్నింగ్..
pawan kalyan speech

Pawan Kalyan Speech latest(AP politics): హిందూధర్మం అంటే తమాషాగా ఉందా.. హిందూధర్మం జోలికి వస్తే ఖబడ్దార్.. అంటూ సీఎం జగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని.. అన్నవరం ఆలయంలో పురోహితులను వేలం వేయడం ఏంటని మండిపడ్డారు. సీఎం జగన్ దేవాలయాలనే ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు. జగన్‌ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయని.. విగ్రహాల ధ్వంసం కేసులో దోషులను ఇప్పటి వరకు పట్టుకోలేదన్నారు పవన్. 


దేవాలయాల్లోని పురోహితులను వేలం వేయడం రాజ్యాంగ విరుద్దమన్నారు జనసేనాని. ఇదే పనిని ఇస్లాం, క్రిస్టియన్ మతాల్లో చేయగలరా? అని నిలదీశారు. మత విషయాల్లో ప్రభుత్వ ప్రమేయం తగదన్నారు. పురోహితుల వేలంపై జనసేన తరఫున కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు పవన్ కల్యాణ్.

ధరల పెరుగుదల, మద్యం ధరల పెంపు, చెత్త పన్ను, ఇసుక మైనింగ్, సీపీఎస్ రద్దు, ఉద్యోగుల పీఎఫ్‌ పక్కదారి పట్టించడం.. ఇలా జగన్ డిజిటల్ దొంగలా మారారని.. జగన్ జగ్గూ భాయ్ అయ్యారని మండిపడ్డారు పవన్.


కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను జగన్ మార్చేశారని.. నవరత్నాలు అందులోనుంచే పుట్టుకొచ్చాయని.. ఈ పథకాలు జగన్‌కు ముందు కూడా ఉన్నాయని వివరించారు జనసేనాని.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×