BigTV English

Pawan Kalyan: మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్.. జనసేనాని ధరల ధూంధాం..

Pawan Kalyan: మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్.. జనసేనాని ధరల ధూంధాం..
pawan kalyan speech

Pawan kalyan speech yesterday(Andhra pradesh political news today): జగన్ పాలనపై క్రిటికల్ అనాలసిస్ అంటూ ధరల దుమ్ముదులిపేలా తనదైన స్టైల్‌లో రెచ్చిపోయారు పవన్ కల్యాణ్. తాడేపల్లి వారాహి విజయయాత్రలో.. ఏపీలో ధరల పెరుగుదలపై ప్రత్యేకంగా మాట్లాడారు.


‘ధూర్తుల సామ్రాజ్యంలో ఆర్తుల ఆహాకారాలు’.. ఇలా పవన్ ప్రసంగం అంతా కవితాత్మకంగా సాగింది. పలువురు కవుల కవితలను కోట్ చేస్తూ.. తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ కొంపలు అంటిస్తుంది.. జనసేన గుండెలు అంటిస్తుంది.. అంటూ పలు పంచ్ కొటేషన్స్ వదిలారు.

తాను లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తిగానే పెరిగానని.. ఇంటికి కావలసిన సరుకులను, గేదెకు గడ్డి కూడా తానే కొనుక్కొని వచ్చేవాడినని చెప్పుకొచ్చారు. జగన్ సీఎం అయ్యాక.. ఏయే ధరలు ఎంతెంత పెరిగాయో చదివి వినిపించారు.


జగన్ వచ్చాక.. ఇంటిపన్ను రూ.600 పెంచారని.. చెత్త మీద 100 రూపాయలు పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్‌ది అని మండిపడ్డారు.

రూ.10వేలు ఉండే ఇసుకను 40 వేలు చేశారని.. చింతపండు 122 ఉంటే 310కి పెరిగిందని అన్నారు. వంటనూనె 89 నుంచి 165 పెంచేశారని.. కందిపప్పు 87 నుంచి 146.. పంచదార 26 నుంచి 50.. మినపప్పు 72 నుంచి 162 పెంచారని విమర్శించారు.

ఇక, మద్యం ధరలపై పవన్ చేసిన కామెంట్లు కాక రేపాయి. పబ్లిక్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. రూ.60 ఉండే మద్యాన్ని ఏకంగా 160 చేశారని.. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావ్ జగన్..అంటూ జనసేనాని సెటైరికల్‌గా విరుచుకుపడ్డారు. మద్యనిషేధం అంటూ మద్యం ధరలు పెంచేసి.. 30వేల కోట్లు కొట్టేశావ్..అని జగన్‌పై ఫైర్ అయ్యారు జనసేనాని.

పెంచిన రేట్లకు ముఖం చూపించలేకనే.. పరదాలు కట్టుకుని తిరుగున్నారని.. రోడ్డు మీద కాకుండా హెలికాప్టర్‌లో తిరుగుతున్నావ్ జగన్..అంటూ ఓ రేంజ్‌లో విమర్శించారు పవన్ కల్యాణ్.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×