E-Paper
Advertisement

Pawan Kalyan : మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ.. పొత్తులపై క్లారిటీ ఇస్తారా..?

Pawan Kalyan : మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ.. పొత్తులపై క్లారిటీ ఇస్తారా..?
Advertisement

Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని ఇప్పటికే పవన్‌ కల్యాణ్ పలుసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇద్దరి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది.

2019 ఎన్నికల తర్వాత 3సార్లు చంద్రబాబు, పవన్‌ భేటీ జరిగింది. విశాఖలో పవన్‌ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడం, ఆయన బస చేసిన హోటల్ లో తనిఖీలు చేయడం, జనసేన నేతలను అరెస్టు చేయడం లాంటి పరిణామాలు జరిగినప్పుడు విజయవాడ నోవాటెల్‌ హోటల్ లో చంద్రబాబు.. పవన్‌ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. అలాగే కుప్పం పర్యటనలో చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించడం, టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి ఘటనల తర్వాత పవన్‌ హైదరాబాద్‌ లోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత మరోసారి చంద్రబాబును పవన్ కలిశారు. అప్పట్లో పొత్తులపై తాము ఎలాంటి చర్చలు జరపలేదన్నారు పవన్.

Advertisement

తాజా భేటీలో పొత్తులపై చంద్రబాబు, పవన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో జనసేనాని పాల్గొన్నారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తులపై బీజేపీ నేతల అభిప్రాయాలను చంద్రబాబుకు పవన్ వివరించే అవకాశం ఉందని సమాచారం. అలాగే జనసేన, టీడీపీ పొత్తుపైనా చర్చించవచ్చని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ తమతో కలిసి రాకుంటే ఏం చేయాలనేదానిపైనా చర్చిస్తారని టాక్‌.

ఢిల్లీలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతోపాటు, ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, దానిపై ప్రభుత్వ స్పందన లాంటి విషయాలపైనా చర్చించే అవకాశముంది.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×