BigTV English

Pawan Kalyan : జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజలకు పవన్ పిలుపు

Pawan Kalyan : జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజలకు పవన్ పిలుపు

Pawan Kalyan: విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించారు. రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ప్రజల్ని వైఎస్ఆర్ సీపీ నాయకులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల బంగారు భవిష్యత్‌ కోసం జనసేనను నమ్మాలని పిలుపునిచ్చారు.వైకాపా ప్రభుత్వ మోసాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు రాజకీయ అధికారం దక్కాలని స్పష్టం చేశారు.జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు ఎలా ఉంటుందో చూపిస్తామని హామీ ఇచ్చారు.


యువత అవినీతి నిర్మూలన కోసం పోరాడాలని జనసేనాని కోరారు. ప్రజల భవిష్యత్‌ కోసం తనను నమ్మాలన్నారు. తనపై నమ్మకం ఉంచితే గూండాలతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మత్స్యకారులు ఉపాధి కోసం గోవా లాంటి ప్రాంతాలకు వెళ్తున్నారని తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు హాని కలిగించే ఎలాంటి చర్యనైనా జనసేన అడ్డుకుంటుందని హెచ్చరించారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొద్దామన్నారు. ఉత్తరాంధ్ర జనసైనికులు ధైర్యంగా పోరాడాలని కోరారు. కేసులు పెడితే తాను వస్తానని భరోసా కల్పించారు. అవినీతి కోటల్ని బద్దలు కొడదాం అని పవన్‌ పిలుపునిచ్చారు.

ఉత్తరాంధ్ర పర్యటనలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. విజయనగరం వై-జంక్షన్‌లో జన సైనికులు గజమాలతో సత్కరించారు. పవన్ కల్యాణ్ విజయనగరం, గొట్లాం మీదుగా గుంకలాం లేఅవుట్‌కు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో పవన్ ఈ కార్యక్రమం చేపట్టారు.


Related News

CM Chandrababu: నేతలను దులిపేసిన సీఎం చంద్రబాబు.. సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్య

Vizag real estate: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ ప్లాట్ కావాలా? ఇదే ఛాన్స్!

CM Chandrababu: పెద్దాపురంలో కలకలం.. చంద్రబాబు కాన్వాయ్ ఆపిన భూమి బాధితుడు!

Kotamreddy Sridharreddy: ఇది నాకొక పాఠం.. ఇకపై పెరోల్ కోసం ఎవ్వరికీ లేఖలు ఇవ్వను

Amaravati Central Library: అమరావతిలో హైటెక్ హంగుల లైబ్రరీ.. దీని స్పెషాలిటీ ఏమిటంటే?

TTD Treasury: వెంకన్న ఖజానాలో ఉన్న బంగారం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!

Big Stories

×