Land Grabbing Case : ఏపీలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని అనేక అవకతవకలు వరుసగా బయటపడుతుండగా.. తాజాగా రాష్ట్రం జగన్ బినామీలుగా అనేక మంది పేరుపై అక్రమంగా భూములు భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయనే వార్తలు బయటకు వస్తున్నాయి. కాగా.. ఈ విషయంలో ఏకంగా రిజిస్ట్రారే ప్రభుత్వానికి లేఖ రాయడం, అనేక విషయాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు సిద్ధపడడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో.. ప్రధాన నిందితుడిగా ఉన్న సినీ నటి రితూ చౌదరి భర్త చిమకుర్తి శ్రీకాంత్. మాజీ రిజిస్ట్రార్ ధర్మా సింగ్ మధ్య ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. ఇందులో అనేక విషయాలు బయటకు వస్తుండడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
ప్రస్తుతం ఈ ఆడియో గురించి ఏపీలో తీవ్ర చర్చ నడుస్తోంది. కాగా.. ఇందులోని వ్యక్తులు.. చీమకుర్తి శ్రీకాంత్, రిజిస్ట్రార్ ధర్మ సింగ్ మధ్య జరిగిన వాస్తవ ఆడియోనా.? కాదా.? తెలియాల్సి ఉంది. అలానే.. అందులో ప్రస్తావించిన వ్యక్తుల పూర్తి పేర్లను ఆడియోలో తెలపకపోవడంతో వారెవరూ, వారి వివరాలపై పూర్త స్పష్టత కరవైంది. ప్రస్తుతానికి.. ఇది చర్చనీయాంశం కాగా.. దీనిపై ఇప్పుడిప్పుడే రాజకీయ రభస మొదలైంది.
Also Read : వైసీపీతో నాకున్న సంబంధం ఇదే.. కుండబద్దలు కొట్టిన శ్రీకాంత్