GMC Meeting: కార్పొరేషన్ సమావేశాల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా అపోజిషన్ సభ్యులు కౌన్సిల్ నుంచి వాకౌట్ చేయడం చూస్తుంటాము. కానీ గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రూటే సెపరేట్. మాటకు మాట నేపథ్యంలో సమావేశం నుంచి బాయ్‌కట్ చేశారు అధికారులు. అసలేం జరిగింది.. డీటేల్స్‌లోకి వెళ్లొద్దాం.
శనివారం ఉదయం గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. అధికారులపై డిప్యూటీ మేయర్ డైమండ్‌బాబు మండిపడ్డారు. మీరు చెబుతున్న లెక్కలన్నీ తప్పులంటూ విరుచుకుపడ్డారు . ఈ క్రమంలో అసభ్యకరమైన పదాలను ఉపయోగించారు. మండిపడిన కమిషన్ సహా అధికారులు సమావేశం వెళ్లిపోయారు. ఈ గందరగోళంలో సభను అరగంటపాటు వాయిదా వేశారు మేయర్.
కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే ఆదాయ-వ్యయాలపై చర్చ జరుగుతోంది. వచ్చిన ఆదాయం.. చేసిన వ్యయాల గురించి సమావేశంలో వివరిస్తున్నారు. వెంటనే డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు జోక్యం చేసుకున్నారు . అవన్నీ తప్పుడు లెక్కమంటూ విరుచుకుపడ్డారు. ఆవేశంతో కొన్ని అభ్యంకరమైన వ్యాఖ్యలు చేశారు.
దీంతో అధికారులు మండిపడ్డారు. ఈలోగా కమిషన్ జోక్యం చేసుకున్నారు. అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. కొన్ని పదాలను వాడడం మంచిది కాదని, వాటిని ఉపసంహరించుకోవాలన్నారు. మళ్లీ అలాంటి పదాలు రిపీట్ కావడంతో కమిషనర్ ఆగ్రహంతో రగిలిపోయారు.
ALSO READ: వైసీపీతో నాకున్న సంబంధం ఇదే.. కుండబద్దలు కొట్టిన శ్రీకాంత్
డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలు సరిగా లేవని, జోక్యం చేసుకోవాలని మేయర్ మనోహర్ నాయడుకు వివరించారు కమిషనర్. మేయర్ సైలెంట్‌గా ఉండిపోయారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల సమావేశం తాము వెళ్లిపోతున్నట్లు తెలిపారాయన. కమిషనర్‌కు మద్దతుగా మిగతా సిబ్బంది సమావేశాన్ని బాయ్‌కట్ చేశారు. పరిస్థితి గమనించిన మేయర్ సమావేశాన్ని అరగంటపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కమిషనర్‌ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికార-విపక్ష సభ్యులు.
గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లో మైకు విసిరివేసి బయటకు వెళ్లిపోయిన కమీషనర్ పులి శ్రీనివాసులు
వైసిపి కార్పొరేటర్లు నగర కమిషనర్ మధ్య తీవ్ర వాగ్వివాదం#Andrapradesh pic.twitter.com/A87tqMTdDO
— TDP Trends (@Trends4TDP) January 4, 2025