BigTV English

PM Modi Attend Andhra CM Swearing: ఎల్లుండే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

PM Modi Attend Andhra CM Swearing: ఎల్లుండే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

PM Modi Attend Andhra CM Swearing: ఏపీలో ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారమహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు మేధ టవర్స్ వద్ద సభా స్థలంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు ఇతర అతిథులు హాజరుకావడంతో భద్రతను మరింత పటిష్టంగా చేస్తున్నారు. ఈ మేరకు దాదాపు 7వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీ హాజరుకావడంతో కేంద్ర బలగాలు సైతం భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.


ప్రధాని షెడ్యూల్ ఇదే..

కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ  మేరకు ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 8.20 నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ బయలుదేరనున్నారు. ఈ మేరకు ఉదయం 10.40 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా కేసరపల్లి వద్ద జరిగే ప్రమాణ స్వీకారమహోత్సవ ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయలుదేరుతారు.


ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. ప్రధాన పర్యటన కోసం ఫూల్ ప్రూఫ్ ఏర్పట్లు చేయడంతోపాటు సమన్వయం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా, టీడీపీ కూటమి 175 స్థానాల్లో 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు చంద్రబాబుకే జూ కొడుతున్నారు. రేపు సీఎం అభ్యర్థిగా చంద్రబాబు పేరును ప్రకటించనున్నారు. ఈ మేరకు విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై చంద్రబాబును శాసనపక్ష నేగా ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆ తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేయనున్నారు.

Also Read: ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై.. కేశినేని నాని సంచలన నిర్ణయం..

Tags

Related News

Women Health Camps: సెప్టెంబ‌ర్ 18 నుంచి.. మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు..!

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కొత్త మలుపు.. ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, వైసీపీలో గుబులు

Temple Stampedes: ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు.. ఆ ఎస్పీని టార్గెట్ చేసుకున్న వైసీపి.. ప్రభుత్వం ఘాటు రిప్లై!

AP Mega DSC 2025: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు షాక్.. నియామక పత్రాల పంపిణీ వాయిదా

AP Assembly: అసెంబ్లీ సమావేశాలు.. మండలిలో యూరియా సెగ, పలుమార్లు సభ వాయిదా

AP Railways: ఏపీలో కొత్తగా 11 రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులు, ఆ శాఖ గ్రీన్ సిగ్నల్

Amaravati News: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు‌పై ఉత్కంఠ, సాయంత్రం నిర్ణయం?

Anchor Shyamala: ఏం చెప్పారు శ్యామలగారు.. భూమనను మించిపోయారుగా!

Big Stories

×