Commercial LPG: కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల వినయోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గించింది. దీంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించింది. ధర తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలకు మేలు కలగనుంది.
ప్రస్థుతం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 202, తగ్గి 2,728 వద్ద నిలకడగా ఉంది. కోల్‌కతాలో రూ. 209 తగ్గి ప్రస్థుతం 2,872.50 ధరలను గ్యాస్ కంపెనీలు తగ్గించాయి. అయితే ప్రస్ధుతం తగ్గించిన ధరలు కేవలం వాణిజ్య సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుందన్న కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సాధారన గ్యాస్ సిలిండర్ల ధరలలో ఇప్పటి వరుకు ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: విమానం ఎగరకముందే రచ్చ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరిది?
అయితే గత రెండు నెలలుగా వరుసగా కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ధర తగ్గింపుతో దేశంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలకు కాస్త ఊరట లభించినట్టైంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇటీవల కాలంలో వరుసగా కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో తాజాగా ధరలు తగ్గడంతో ప్రజలు వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: సీత పాత్రతో జాక్‌పాట్ కొట్టిందా?.. సాయి పల్లవి రెమ్యూనరేషన్‌పై కొత్త టాక్!