Big Stories

PM Modi: వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. రాజధానుల పేరిట లూటీ : పీఎం మోదీ

PM Modi Speech At Rajahmundry: ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. గోదావరి మాతకు ప్రణామాలు..ఈ నెల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాసారు. ఇక్కడ నుంచే కొత్త చరిత్ర లిఖించబోతున్నాం అంటూ మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

- Advertisement -

ప్రచార సభలో వైసీపీపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అవినీతిని జెట్ స్పీడ్ లో పరిగెత్తించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశం, ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమితోనే సాధ్యం అని అన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు.

- Advertisement -

టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించిందని చెప్పారు. వైసీపీ కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణాలను ఆలస్యం చేసిందని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశం కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల వద్ద కోట్ల రూపాయల అక్రమ ధనం ఉందని ఆరోపించారు.

Also Read: రూటు మార్చిన కేఏపాల్, ఈసారి కొత్తగా..

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని అన్నారు. వైసీపీ రాష్ట్ర ఖజానాను కాళీ చేసిందని ఆరోపించారు. విశాఖ – చెన్నై కారడార్ నిర్మాణం చేపడతామని తెలిపారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏపీ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని సూచించారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News