BigTV English

MLA Kasireddy Narayana Reddy: ఎమ్మెల్యే కారును ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులు మృతి

MLA Kasireddy Narayana Reddy: ఎమ్మెల్యే కారును ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులు మృతి

Kalvakurti MLA Kasireddy Narayana Reddy: రంగారెడ్డి జిల్లాలో విషాధం చోటుచేసుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బయటపడ్డారు.


కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే కారును ఓ బైకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మల్లు రవికి మద్దతుగా తలకొండపల్లి మండలం వెల్జాల్ లో ప్రచారం ముగించుకుని వెళ్తుండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారును ఓ బైక్ బలంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న నరేశ్ అనే 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు బైరవపాక పరుశరాములుకు తీవ్ర గాయల్యయ్యాయి. దీంతో వెంటనే క్షతగాత్రుడిని కల్వకుర్తిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.


అయితే పరశురాములు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను వెంకటాపుర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Also Read: ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మహిళలు మృతి

ఈ ప్రమాదంలోఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కారును ఒక్కసారిగా వేగంగా వచ్చి బైక్ ఢీకొట్టడంతో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాద సమయంలో కారులో ఎయిర్ బెలూన్లు సకాలంలో తెరుచుకున్నాయి. దీంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Tags

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×