BigTV English

PM Modi : నేడు శ్రీసత్యసాయి జిల్లాకు మోదీ.. జాతీయ అకాడమీ ప్రారంభించనున్న పీఎం..

PM Modi : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఇక్కడ ఏర్పాటవుతోంది. ఈ శిక్షణ కేంద్రాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ప్రధాని పర్యటనలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 44వ హైవేను ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడి నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి గంటలో చేరుకోవచ్చు. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ తరహాలో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఆవరణలోనే సోలార్‌ సిస్టం కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని తీసుకొచ్చారు.

నాసిన్‌ కోసం ప్రత్యేక రైల్వేలైన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో పనిచేసే సిబ్బంది పిల్లల విద్య కోసం దగ్గరలోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశారు. దీనికి కావాల్సిన స్థలాన్ని రెవెన్యూశాఖ గుర్తించింది. మరోవైపు ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం ఆసక్తి చూపిస్తుంది. పరిశ్రమల ఏర్పాటుపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో తొలి అడుగు పడింది. 2015 ఏప్రిల్‌లో ఆనాటి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి ఆధ్వర్యంలో నాసిన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×