PM Modi Vizag Tour: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఈనెల 29న రావాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు పీఎంఓ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఏపీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం 164 సీట్లను కైవసం చేసుకున్న అనంతరం జరిగిన, సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పీఎం నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ తరువాత వైజాగ్ పర్యటన నిమిత్తం 29న ప్రధాని రావాల్సి ఉంది. ప్రధాని వస్తున్న సందర్భంగా స్వయంగా ఏర్పాట్లను మంత్రి నారా లోకేష్ గత మూడు రోజులుగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోడీ వస్తున్న సందర్భంగా.. భారీ ఏర్పాట్లకు కూటమి నేతలు శ్రీకారం చుట్టారు.
పర్యటన రద్దు కాకుంటే, వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అలాగే రోడ్ షోకు సైతం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. సుమారు రూ. 85 వేల కోట్లతో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ తో పాటు వైజాగ్ రైల్వే జోన్, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు ముందుగా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో ప్రధాని పర్యటన రద్దయినట్లు సమాచారం. అయితే 29వ తేదీన వర్చువల్ విధానం ద్వారా ప్రధాని ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారా, లేక వేరే తేదీని ఖరారు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
Also Read: Case Against Aghori: లేడీ అఘోరీపై కేసు నమోదు.. బలిచ్చినట్లు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?
విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాయి. ప్రత్యేకంగా ప్రధాని మోడీ అధ్వర్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పర్యవేక్షణలో హెడ్ క్వార్టర్స్ నిర్మాణం పూర్తి కాగా వైజాగ్ ప్రజల కల సాకారమైనట్లు స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. మొత్తం మీద ప్రధాని పర్యటించి ఉంటే తాము ప్రధానిని దగ్గర నుండి చూసే అవకాశం ఉండేదని, కానీ ప్రధాని పర్యటన రద్దు కావడం తమకు నిరాశకు గురి చేసిందని ప్రజలు అభిప్రాయ పడ్డారు.
ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను హెచ్చరికలతో పీఎంఓ తాజా నిర్ణయం
ఈ నెల 29న విశాఖలో పర్యటించాల్సి ఉన్న మోదీ @narendramodi @PMOIndia #Modi #Vizag #ModiVizagTour #Bigtv pic.twitter.com/lARSZ5nS38
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2024