IPL Auction 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( IPL 2025) సంబంధించిన మెగా వేలం… రెండో రోజు కూడా కొనసాగుతోంది. అయితే ఈ రెండో రోజు మెగా వేలంలో…. కొంతమంది మాత్రమే భారీ ధర పలుకుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే… చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ దీపక్ చాహర్ కు ( Deepak Chahar) జాక్పాట్ తగిలిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో పెద్దగా ఆట తీరు కనబడచకపోయినా అతనికి 9.25 కోట్లు వచ్చాయి. దీపక్ చాహర్ ను ( Deepak Chahar) ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. మొన్నటి వరకు సీఎస్కేకు వాడిన ఇతన్ని 9.25 కోట్లకు కొనుగోలు చేసి ముంబై… సంచలనానికి తెరలేపింది.
Also Read: IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో భారత క్రికెటర్లకు ఎదురు దెబ్బ.. ఈ ప్లేయర్లందరూ unsold
అదే సమయంలో… హైదరాబాద్ స్టార్ పెసర్ భువనేశ్వర్ కుమార్ ను ( huvneshwar Kumar ) కావ్య పాప వదిలేయడం జరిగింది. ఈ విషయం అందరిని షాక్ నకు గురి చేస్తోంది. హైదరాబాద్ జట్టు తరఫున కీలక మ్యాచ్లో వికెట్లు తీసి… దుమ్ము లేపాడు భువనేశ్వర్. కానీ… భువనేశ్వర్ ను కొనుగోలు చేయకుండా హైదరాబాద్ వదిలేసింది. దీంతో… భువనేశ్వర్ కుమారును రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.
Also Read: IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ
హైదరాబాద్ కు చెందిన భువనేశ్వర్ కుమార్ ను.. ఏకంగా 10.75 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. భువనేశ్వర్ కుమార్ వేలంలోకి రాగానే ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. కానీ చివరికి 10.75 కోట్లకు ఆర్సిబి సొంతం చేస్తుంది.
ఇక హార్దిక్ పాండ్యా సోదరుడు అయిన కృనాల్ పాండ్యాను… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేయడం జరిగింది. మొన్నటి సీజన్ వరకు లక్నోకు ఆడిన పాండ్యాను… ఇప్పుడు 5.75 కోట్లకు ఆర్సిబి సొంతం చేసుకుంది. కృనాల్ పాండ్యా మంచి ఆల్రౌండర్. బౌలింగ్ తో పాటు హిట్టింగ్ కూడా చేయగలడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బలంగా తయారైనట్లు చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.
IPL 2025 వేలంలో RCB కొనుగోలు చేసిన ఆటగాళ్లు
లియామ్ లివింగ్‌స్టోన్: రూ 8.75 కోట్లు.
ఫిల్ సాల్ట్ – రూ 11.50 కోట్లు.
జితేష్ శర్మ – రూ 11 కోట్లు.
జోష్ హేజిల్‌వుడ్ – రూ 12.5 కోట్లు.
రసిఖ్ దార్ – రూ 6 కోట్లు.
సుయాష్ శర్మ – రూ 2.6 కోట్లు.
కృనాల్ పాండ్యా – 5.75 కోట్లు
భువనేశ్వర్ కుమార్ – 10.75 కోట్లు
RCB విడుదల చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా
ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, గ్రీన్ కుమార్, కాజర్మర్, రాజన్ కుమార్ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్.