BigTV English

Rajamouli Offer Rs 10,000: ఆ డైరెక్టర్ ను ముసుగేసి కొడితే పదివేలు ఇస్తా: ఎస్ ఎస్ రాజమౌళి బంపరాఫర్!

Rajamouli Offer Rs 10,000: ఆ డైరెక్టర్ ను ముసుగేసి కొడితే పదివేలు ఇస్తా: ఎస్ ఎస్ రాజమౌళి బంపరాఫర్!

Rajamouli Offers Rs 10,000 to Attack Director Anil Ravipudi: దర్శక ధీరుడు రాజమౌళి సెట్ లో ఎంత స్ట్రిక్ట్ డైరెక్టరో అందరికి తెల్సిందే. సీన్ సరిగ్గా రాకపోతే వచ్చేవరకు ఎన్ని టేకులు అయినా.. ఎంత టైమ్ అయినా ఓపిగ్గా తీస్తాడు. కానీ, బయట జక్కన్న అంత స్ట్రిక్ట్ గా ఉండడు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆయన సినిమా ప్రమోషన్స్ లో ఆయన వేసే సెటైర్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే జక్కన్న చాలా రేర్ గా వీరే హీరోల ఫంక్షన్స్ కు అటెండ్ అవుతాడు.


తాజాగా కొరటాల శివ సమర్పిస్తున్న కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి, మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్టులుగా హాజరయ్యారు. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జక్కన్న, అనిల్ రావిపూడి కామెడీ అదిరిపోయింది. SSMB 29 అప్డేట్ చెప్పమని కోరిన అనిల్ కు రాజమౌళి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా జక్కన్న, రామ్ చరణ్, తారక్ ను.. అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేసిన విషయం తెల్సిందే.

Also Read: Prasanna Vadanam Review: సుహాస్ ‘ప్రసన్నవదనం’ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే..?


ఇక ఆ చనువుతోనే అనిల్ రావిపూడి.. ఈరోజు ఎలాగైనా రాజమౌళి SSMB 29 అప్డేట్ ఇవ్వాలని కోరాడు. దానికి రాజమౌళి తనదైన రీతిలో కౌంటర్ వేశాడు. ” ఎవరైనా వెనక నుంచి కెమెరా పట్టుకుని వెళ్లి అనిల్ రావిపూడి మీద ముసుగేసి కొడితే 10 వేలు ఇస్తా” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అనిల్ షాక్  అయ్యి.. మీరు ఇలాంటి ఆఫర్ ఇస్తే నిజంగా కొట్టేసేలా ఉనానరు.. కొంచెం ఆఫర్ తగ్గించండి అంటూ బతిమిలాడాడు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయ్యో ఎందుకు జక్కన్న అంత కోపం.. అప్డేట్ యేగా అడిగింది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి త్వరలోనే అనిల్ కు కావాల్సిన అప్డేట్ వస్తుందేమో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×