Trail OTT:ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ జానర్ లో సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు హీరోలే కాకుండా ఇటు హీరోయిన్ లు కూడా ఎక్కువగా ఓరియంటెడ్ చిత్రాలతో.. ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్ హిట్ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండవ సీజన్ త్వరలో స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఆగస్టు 22న మేకర్స్ ఈ ట్రయల్ సీజన్ 2 ట్రైలర్ విడుదల చేశారు. రెండో సీజన్ ట్రైలర్ కూడా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
స్ట్రీమింగ్ కి రాబోతున్న ట్రయిల్ సీజన్ 2..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కాజోల్ నటించిన సూపర్ హిట్ లీగల్ థ్రిల్లర్ ట్రయల్ కొనసాగింపుగా ట్రయల్ సీజన్ 2 రాబోతోంది. సీనియర్ నటి కాజోల్ లాయర్ నయానిక సేన్ గుప్తా పాత్రలో మళ్లీ తిరిగి వచ్చారు. సెప్టెంబర్ 19 నుండి ఈ కొత్త సీజన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ట్రయల్ మొదటి సీజన్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కాజోల్ ఇప్పుడు సీజన్ 2కి కూడా సిద్ధం అవ్వడంతో అభిమానులు ఈ వెబ్ సిరీస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఆకట్టుకున్న ట్రైలర్..
ది ట్రయల్ ప్యార్ కానూన్ దోఖా సీజన్ 2 లో లాయర్ నయానిక తన కేసులను పరిష్కరిస్తున్నప్పుడు.. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను కూడా ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈమె భర్త రాజీవ్ (జిషు సేమ్ గుప్తా) తో ఈమెకు తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ట్రైలర్ చివరిలో నయానిక నాకు విడాకులు కావాలి అని చెప్పడం చూపించారు. అయితే రాజీవ్ ఎన్నికలలో గెలవాలి అంటే నయానిక ఇమేజ్ చాలా అవసరం. కాబట్టి అతను ఆమెను కోల్పోవడానికి ఇష్టపడడు నయానికా మాత్రం అతడు పెట్టే టార్చర్ భరించలేక.. పిల్లల కోసం విడాకులు కోరుతుంది.. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాన్ని వెబ్ సిరీస్ లో చూడాల్సిందే. ఇకపోతే తన పిల్లల కోసం ఎంతవరకైనా వెళ్లే పాత్రలో ఈమె ఈ కొత్త సీజన్లో కనిపించబోతోంది అని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రేమ మోసాలతో నిండిన ఈ ట్రయల్ 2 లో నయానిక పాత్రలో తనను తాను ఎంచుకుంటుందా లేదా తన కర్తవ్యాన్ని ఎంచుకుంటుందా అనేది చాలా స్పెషల్ గా చూపించనున్నారు.
మా మూవీను గుర్తు చేస్తున్న ట్రయిల్ ట్రైలర్ సీజన్ 2..
ఇకపోతే ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇటీవల కాజోల్ నటించిన హార్రర్ మూవీ ‘మా’ సినిమాను కూడా గుర్తుచేస్తుంది. అందులో కాజోల్ తన కుమార్తెను రక్షించడానికి ఎంతకైనా తెగించే తల్లి పాత్ర పోషించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కూడా ఆగస్టు 22 నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈమె నటించిన ట్రయల్ సీజన్ 2 సెప్టెంబర్ నుండి ఓటీటీలోకి రాబోతోంది. మరి అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ:OTT Movie: సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. ఎక్కడంటే?