BigTV English

Nellore: అనిల్ ప్రమాణం.. నల్లపురెడ్డి ‘ఉరి’ సవాల్.. లోకేశ్‌కు స్ట్రాంగ్ కౌంటర్..

Nellore: అనిల్ ప్రమాణం.. నల్లపురెడ్డి ‘ఉరి’ సవాల్.. లోకేశ్‌కు స్ట్రాంగ్ కౌంటర్..

Nellore news today telugu(AP political news) : నెల్లూరు పాలిటిక్స్ పీక్స్‌కు చేరాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ స్పందించారు. ప్రమాణం చేయాలన్న సవాల్‌ను స్వీకరించారు. నెల్లూరు వెంకటేశ్వరపురంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రమాణం చేశారు.


నాలుగు రోజులుగా లోకేష్‌.. అనిల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వెయ్యి కోట్ల వరకు దోచేశారని మండిపడ్డారు. భూములకు సంబంధించిన ఆస్తుల చిట్టా వెల్లడించారు. అవన్నీ బినామీలతో అక్రమంగా ఆర్జించారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌పై లోకేష్‌ ఆరోపణలు గుప్పించారు.

లోకేశ్ ఆరోపించినట్టు.. ఆ భూములు తనవి కాదని చెప్పిన అనిల్‌.. తాజాగా గుడిలో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే అనిల్ ప్రమాణానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తనకు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవని దేవుని ఎదుట ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రమాణం చేశారు. తాను చెప్పిన విధంగానే వెంకటేశ్వర స్వామి ఎదుట ప్రమాణం చేశానని అన్నారు.


మరోవైపు.. నారా లోకేష్‌ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రసన్నకుమార్‌ రెడ్డి 15 వందల కోట్ల అవినీతి చేశారన్న ఆరోపణలపై సీరియస్ అయ్యారు. లోకేష్‌ ఆరోపణలపై సీఎం జగన్‌ ను కలిసి సీబీఐ ఎంక్వైరీ కోరుతా అని స్పష్టం చేశారు నల్లపురెడ్డి. అవసరమైతే సిట్టింగ్‌ జడ్జితో విచారణకైనా సిద్ధమే అంటూ సవాల్ చేశారు. తాను అవినీతి చేశానని తేలితే బుచ్చి బస్టాండ్‌లో ఉరివేసుకుంటా.. అంటూ సంచలన కామెంట్ చేశారు నల్లపురెడ్డి.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×