BigTV English

Chittoor : పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణమేంటి.. ?

Chittoor : పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణమేంటి.. ?

Chittoor : తల్లిదండ్రులు తమ పిల్లలకు కష్టం తెలియకుండా చదివిస్తారు. కానీ విద్యార్థులు చిన్న చిన్న విషయాలకు మనస్తాపానికి గురై ఆత్యహత్యలు చేసుకుంటున్నారు.ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


శ్రీరంగరాజపురం మండలానికి చెందిన రసజ్ఞ (16) పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం తోటి విద్యార్థులు కళాశాలకు వెళ్లగా హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సిబ్బంది హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రసజ్ఞ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ సుధాకర్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. పాలిటెక్నిక్ కళాశాలలో రసజ్ఞ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్న సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.


Related News

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Big Stories

×